Rohit Sharma : ఆ ఇద్దరూ చెబితేనే డీఆర్ఎస్‌కు వెళ్తా.. నేను దానిలో తలదూర్చను : రోహిత్ శర్మ
వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో సెమీస్ చేరింది టీమ్ఇండియా.

Rohit Sharma on DRS
Rohit Sharma on DRS : వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో సెమీస్ చేరింది టీమ్ఇండియా. గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను 302 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ తమ తొలి లక్ష్యం పూర్తి అయ్యిందని చెప్పాడు. అధికారికంగా సెమీస్ చేరుకోవడంతో ఎంతో ఆనందంగా ఉందన్నాడు. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదురుకానున్నాయని వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
ఈ టోర్నీ ఆరంభంలో మా మొదటి లక్ష్యం సెమీస్ చేరుకోవడం. ఇప్పుడు ఈ లక్ష్యం పూర్తి అయ్యింది. తరువాతి లక్ష్యం ఫైనల్ చేరుకోవడం అని రోహిత్ అన్నాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడగా కొన్ని మ్యాచుల్లో కఠిన పరిస్థితులు ఎదురైనా సరే ఆటగాళ్లు అద్భుతంగా రాణించారన్నారు. ప్రతి ఒక్క ఆటగాడు తమ తమ బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వర్తించాడని రోహిత్ చెప్పాడు.
వికెట్ కీపర్, బౌలర్ నిర్ణయం మేరకే డీఆర్ఎస్..
బౌలర్లు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని రోహిత్ అన్నాడు. డీఆర్ఎస్ తీసుకునే విషయం బౌలర్, వికెట్ కీపర్ నిర్ణయానికి వదిలివేసినట్లు చెప్పాడు. ఎందుకంటే బంతి గమనం వారిద్దరికే బాగా తెలుస్తుందన్నాడు. వ్యక్తిగతంగా తనకు పత్రి ఒక్కరి పై నమ్మకం ఉందని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో రెండు సార్లు డీఆర్ఎస్ తీసుకోగా ఓ సారి అనుకూల నిర్ణయం రాగా.. మరొసారి రాలేదు అని రోహిత్ తెలిపాడు.
SriLanka : ఫోన్ నంబర్లతో సరిపెట్టుకుంటున్న శ్రీలంక ఆటగాళ్లు.. ఇదేందీ సామి.. మరీ ఇలాగానా..!
తరువాతి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడనున్నాం. ఈ మెగా టోర్నీలో ఆ జట్టు అద్భుతంగా ఆడుతోంది. దీంతో మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుందని అనుకుంటున్నట్లు చెప్పాడు.
కేఎల్ రాహుల్ అదుర్స్..
ఈ మ్యాచ్‌లో రాహుల్ తన అద్భుతమైన నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 12వ ఓవర్‌ను మహ్మద్ షమీ వేశాడు. మూడో బంతిని లెగ్ సైడ్‌గా వేశాడు. చమీర షాట్ ఆడగా కేఎల్ రాహుల్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. అయితే.. బంతి బ్యాట్‌ను తాకలేదని భావించిన అంపైర్ క్రిస్ బ్రౌన్ వైడ్‌గా ప్రకటించి నాటౌట్ ఇచ్చాడు. వెంటనే రాహుల్ డీఆర్ఎస్‌కు వెళ్లాలంటూ కెప్టెన్ రోహిత్ శర్మకు సూచించాడు. రాహుల్ పై నమ్మకంతో రోహిత్ డీఆర్ఎస్‌కు వెళ్లగా బంతి బ్యాటర్ గ్లోవ్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో అంపైర్ నిర్ణయాన్ని మార్చుకుని చమీరను ఔట్ ప్రకటించాడు.
ఇంకొకటి ఫట్..
సిరాజ్ బౌలింగ్‌లో సధీర సమరవిక్రమ్ షాట్ ఆడగా క్యాచ్ విషయంలో రాహుల్‌కు అప్పీల్‌కు వెళ్లాడని సూచించాడు. ఇక్కడ ఫలితం ప్రతికూలంగా వచ్చింది. బాల్ బ్యాట్‌ను తాకలేదని తేలింది.
ODI World Cup 2023 : శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ల ఆన్ ఫీల్డ్ ప్రేమ.. మీమ్స్ వైరల్