SL vs NZ : ఆరేసిన ప్ర‌భాత్‌ జ‌య‌సూర్య‌.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 88 ఆలౌట్‌.. గాలేలో ప‌ట్టుబిగించిన శ్రీలంక‌..

గాలె వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచులో శ్రీలంక ప‌ట్టు బిగించింది.

SL vs NZ : ఆరేసిన ప్ర‌భాత్‌ జ‌య‌సూర్య‌.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 88 ఆలౌట్‌.. గాలేలో ప‌ట్టుబిగించిన శ్రీలంక‌..

New Zealand all out for 88 concedes second biggest innings deficit in its Test history

Updated On : September 28, 2024 / 12:33 PM IST

Sri Lanka vs New Zealand : గాలె వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచులో శ్రీలంక ప‌ట్టు బిగించింది. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 88 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో లంక‌కు తొలి ఇన్నింగ్స్‌లో 514 ప‌రుగుల భారీ ఆధిక్యం ల‌భించింది. టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక జ‌ట్టు సాధించిన అతి పెద్ద ఆధిక్యం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. అటు కివీస్ రెండో సారి ప్ర‌త్య‌ర్థికి అత్య‌ధిక ఆధిక్యాన్ని క‌ట్ట‌బెట్టింది. లంక జ‌ట్టు 602-5 స్కోరు వ‌ద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

Musheer Khan : రోడ్డు ప్ర‌మాదానికి గురైన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సోద‌రుడు ముషీర్ ఖాన్‌.. 3 నెల‌లు ఆట‌కు దూరం!

ఓవ‌ర్ నైట్ స్కోరు రెండు వికెట్ల న‌ష్టానికి 22 ప‌రుగుల‌తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొన‌సాగించిన న్యూజిలాండ్ మ‌రో 66 ప‌రుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయింది. మూడో రోజు మ్యాచ్ ఆరంభ‌మైన కాసేప‌టికే ఓవ‌ర్ నైట్ స్కోరుకు మ‌రో ప‌రుగు మాత్ర‌మే జోడించి కేన్ విలిమ‌మ్స‌న్ ఔట్ అయ్యాడు. దీంతో 24 ప‌రుగుల వ‌ద్ద కివీస్ మూడో వికెట్ కోల్పోయింది. ఇక్కడ మొద‌లైన వికెట్ల ప‌త‌నం ఎక్క‌డా ఆగ‌లేదు. లంక స్పిన్న‌ర్లు ధాటికి కివీస్ బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు.

ర‌చిన్ ర‌వీంద్ర(10), డారిల్ మిచెల్ (13), మిచెల్ శాంట్న‌ర్ (29)లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరును అందుకోగా మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. లంక బౌల‌ర్ల‌లో ప్ర‌భాత్ జ‌య‌సూర్య 6 వికెట్ల‌తో కివీస్ ప‌త‌నాన్ని శాసించాడు. నిషాన్ పీరిస్ మూడు వికెట్లు తీశాడు. అసిత ఫెర్నాండో ఓ వికెట్ సాధించాడు.

IND vs BAN : భార‌త అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌.. మైదానం నుంచి హోట‌ల్‌కు వెళ్లిపోయిన టీమ్ఇండియా..

514 లోటుతో రెండో ఇన్నింగ్స్‌..

88 ప‌రుగులకే కుప్ప‌కూలడంతో న్యూజిలాండ్ ఫాలోఆన్ ఆడాల్సి వ‌చ్చింది. 514 ప‌రుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాంగ్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. తొలి ఓవ‌ర్‌లోనే టామ్ లాథ‌మ్ (0) డ‌కౌట్ అయ్యాడు. అత‌డిని నిషాన్ పీరిస్ ఔట్ చేశాడు. మూడో రోజు లంచ్ విరామానికి కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 2 ఓవ‌ర్ల‌కు వికెట్ న‌ష్టపోయి 3 ప‌రుగులు చేసింది. డేవాన్ కాన్వే (2), కేన్ విలియ‌మ్స‌న్ (1) క్రీజులో ఉన్నారు. కివీస్ ఇంకా 511 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.