ఐపీఎల్ 2024కు ముందు చైన్నైకి భారీ షాక్..! రూ.14కోట్లు పెట్టి కొన్న ఆటగాడికి గాయం
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది.

New Zealand lose key player to injury for second South Africa Test
Daryl Mitchell : దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్‌కు గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్‌లో అతడి బొటన వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో అతడిని ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్ జట్టు నుంచి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తప్పించింది. అతడి స్థానంలో యువ ఆల్‌రౌండర్ విల్ ఓరూర్క్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది.
కాగా.. డారిల్ గాయం నుంచి కోలుకునేందుకు నాలుగు వారాలకు పైగా సమయం పట్టనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అతడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా మిచెల్ మూడు ఫార్మాట్లలో న్యూజిలాండ్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అలాంటి ప్లేయర్ గాయపడడం దురదృష్టం అని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ అన్నారు.
ఐపీఎల్‌లో ఆడతాడా?
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ఆల్‌రౌండర్ మిచెల్ గాయపడడం చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఆందోళన గురి చేస్తోంది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అతడు రాణించాడు. దీంతో దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలంలో అతడిని దక్కించుకునేందుకు ప్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు అతడిని చెన్నై రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. మిచెల్ రాకతో చెన్నై మిడిల్ ఆర్డర్ మరింత పటిష్టంగా మారింది.
కాగా.. ఐపీఎల్ ఆరంభానికి నెలరోజులకు పైగా సమయం ఉండడంతో అప్పటి వరకు అతడు కోలుకుంటాడని జట్టు భావిస్తోంది. గాయం తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఐపీఎల్ ఆరంభ మ్యాచులకు అతడు దూరం అయ్యే అవకాశం ఉంది.