హోమిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ ల మధ్య నాలుగో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకొంది. ఇప్పటికే 3-0 తేడాతో భారత్ సిరీస్ ను కైవసం చేసుకొంది. అయితే ఎట్టిపరిస్థితుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదన్న పట్టుదలతో భారత్ ఉంది. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని కివిస్ భావిస్తోంది. 2019 వరల్డ్ కప్ దగ్గరపడుతున్న సమయంలో కివిస్ పై విజయం భారత్ కు మంచి కిక్కు ఇవ్వనుంది.
వరుస సిరీస్ ల సందర్భంగా విరాట్ కోహ్లీకి బీసీసీఐ ఈ మ్యాచ్ ల నుంచి విశ్రాంతి ఇచ్చింది. అతని స్థానంలో రోహిత్ శర్మ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
New Zealand win the toss and elect to bowl first in the 4th ODI against #TeamIndia #NZvIND pic.twitter.com/b1BBppQVdp
— BCCI (@BCCI) January 31, 2019