Virat Kohli: చెప్పి.. చెప్పి అలసిపోయా – విరాట్ కోహ్లీ

ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పడానికి మాటల్లేవని.. ప్రతిసారీ క్లారిఫై చేసి.. చేసి అలసిపోయానంటున్నాడు. మీడియా మిత్రులు రోహిత్ శర్మకు మీకూ ఏమైనా విబేధాలు ఉన్నాయా అని అడిగి

Virat Kohli: చెప్పి.. చెప్పి అలసిపోయా – విరాట్ కోహ్లీ

Virat-Kohli

Updated On : December 16, 2021 / 11:36 AM IST

Virat Kohli: ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పడానికి మాటల్లేవని.. ప్రతిసారీ క్లారిఫై చేసి.. చేసి అలసిపోయానంటున్నాడు. మీడియా మిత్రులు రోహిత్ శర్మకు మీకూ ఏమైనా విబేధాలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు. బీసీసీఐ రెండు వైట్ బాల్ ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు అవసర్లేదని కోహ్లీని టెస్టు ఫార్మాట్ కు మాత్రమే పరిమితం చేయడం పట్ల మీడియా ముఖంగా కామెంట్ చేశాడు విరాట్.

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా 26వ తేదీ నుంచి టెస్టు మ్యాచ్ లు ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పర్యటన కంటే ముందు బయోబబుల్ లోకి ఎంటర్ అవుతూ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. టెస్టు జట్టు ఎంపిక కోసం మీటింగ్ జరిగిన గంటన్నర తర్వాత వైట్ బాల్ కెప్టెన్సీకి ఒకే కెప్టెన్ ఉంటారని తనను టెస్టు ఫార్మాట్ కు పరిమితం కావాలని చెప్పాడు. అంతకుముందు తనకు దీని గురించి ఎటువంటి సమాచారం లేదని తెగేసి చెప్పాడు.

‘నా దగ్గర కారణాల్లేవు. బీసీసీఐ లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ నిర్ణయం తీసుకుంది. నాకు.. రోహిత్ శర్మకు ఎటువంటి సమస్యలు లేవు. రెండేళ్లుగా ఇదే విషయం చెప్పి.. చెప్పి అలసిపోయా. నా వల్ల టీం డిస్టర్బ్ అవడం ఇష్టం లేదు’ అని కోహ్లీ అన్నాడు.

డిసెంబర్ 26 నుంచి మూడు టెస్టులు ఆడనున్న టీమిండియా.. జనవరిలో వన్డే మ్యాచ్ లు ఆడుతుంది.