T20 World Cup 2021: ‘అశ్విన్ ను తీసుకోకపోవడంపై విచారణ జరగాల్సిందే’

టీమిండియా వరుసగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో జరిగిన మ్యాచ్ లలో ఓటమి చవిచూసింది. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు సైతం రాణించలేకపోతుండటంపై సర్వత్రా విమర్శలు కనిపిస్తున్నాయి.

T20 World Cup 2021: ‘అశ్విన్ ను తీసుకోకపోవడంపై విచారణ జరగాల్సిందే’

Veng Sarkar India

Updated On : November 2, 2021 / 1:12 PM IST

T20 World Cup 2021:  టీమిండియా వరుసగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో జరిగిన మ్యాచ్ లలో ఓటమి చవిచూసింది. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు సైతం రాణించలేకపోతుండటంపై సర్వత్రా విమర్శలు కనిపిస్తున్నాయి. ఫలితంగా జట్టు ఎంపికపై సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. టీమిండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను జట్టులో ఆడించకపోవడంపై మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ప్రశ్నిస్తున్నారు.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సంతృప్తికరమైన ప్రదర్శన కనబరచకపోయినా.. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని కివీస్‌తో మ్యాచ్‌లోనూ ఆడించారు. అలా రెండు మ్యాచ్‌లలో అవకాశం వచ్చినా నిరూపించుకోలేకపోయాడు. సీనియర్‌ స్పిన్నర్‌ను కాదని అతడికి అవకాశం ఎందుకిచ్చారని వెంగ్‌సర్కార్‌ అసహనం వ్యక్తం చేశారు.

‘అశ్విన్‌ను చాలా రోజుల నుంచి ఎందుకు పక్కనపెడుతున్నారు? ఈ విషయంపై విచారణ జరగాలి. అత్యుత్తమ స్పిన్నర్‌గా ఫార్మాట్లకు అతీతంగా రాణిస్తున్న అశ్విన్ ఖాతాలో 600కు పైగా అంతర్జాతీయ వికెట్లు ఉన్నాయి. జట్టులో అత్యంత అనుభవమున్న స్పిన్నర్‌ కూడా. అతణ్ని తుది జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ ఒక్క మ్యాచ్‌ ఆడించలేదు. ఆడించాలని లేనప్పుడు ఎందుకు ఎంపిక చేస్తునట్లు? ఇదంతా మిస్టరీలా ఉంది’ అని వెంగ్‌సర్కార్‌ ఓ మీడియాతో అన్నాడు.

……………………………. : నరకాసుర వధ ఎందుకు జరిగిందంటే?..

రెండు మ్యాచ్‌లలోనూ ఆటగాళ్లలో సరైన ప్రదర్శన కనపడలేదు. నిస్సారంగా కనిపించడం వెనుక బయోబబుల్‌ కారణమా.. గతంలో ఇటువంటి బాడీలాంగ్వేజ్‌ చూడట్లేదని అన్నారు. ఇక పాండ్యా విషయానికొస్తే ఫిట్ నెస్ లేకుండా బరిలోకి దిగుతున్నాడు. బ్యాట్ తోనూ బాల్ తోనూ మ్యాచ్ ఆడితే ప్రత్యర్థుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని చెప్పుకొచ్చారు.