NZ tour of Pak: పాక్‌కు పయనం కానున్న కివీస్ జట్టు

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కన్ఫామ్ అయింది. పాకిస్తాన్ గడ్డపై న్యూజిలాండ్ తో జరిగే ద్వైపాక్షిక సిరీస్ వచ్చే ఏడాది జరగనుంది.

NZ tour of Pak: పాక్‌కు పయనం కానున్న కివీస్ జట్టు

Oak Nz

Updated On : December 20, 2021 / 1:00 PM IST

NZ tour of Pak: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కన్ఫామ్ అయింది. పాకిస్తాన్ గడ్డపై న్యూజిలాండ్ తో జరిగే ద్వైపాక్షిక సిరీస్ వచ్చే ఏడాది జరగనుంది. 2021 ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్ కు ముందే జరగాల్సిన పాక్ పర్యటనను రద్దు చేసుకుంది న్యూజిలాండ్. దీనిపై రావాల్సిండి ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ ఇష్యూస్ తో రాలేదంటూ కామెంట్లు కూడా చేశాడు.

కివీస్ పర్యటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ ద్వారా అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది. డిసెంబర్/జనవరి 2022-23 సమయంలో రెండు టెస్టులు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఏప్రిల్ 2023లో 10 వైట్ బాల్ మ్యాచ్ లు కూడా జరగనున్నాయి. అని ట్వీట్ చేసింది పాక్ క్రికెట్ బోర్డు.

పీసీబీ, న్యూజిలాండ్ ఇరు దేశాల క్రికెట్ బోర్డులు చర్చల అనంతరం తేదీలు ఫిక్స్ చేసుకోనున్నాయి. ఏప్రిల్ 2023లో ఐదు వన్డేలు, ఐదు టీ20లు ఫార్మాట్లలో మ్యాచ్ జరగనుండగా.. మొత్తం పాకిస్తాన్ ఎనిమిది టెస్టులు, 11వన్డేలు, 13టీ20లకు వేదిక ఇవ్వనుంది.

………………………….. : రూ.49 లక్షల విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు