Ashwin : రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు.. ఇదే నా చివరి ప్రపంచకప్ కావొచ్చు..
ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడడం స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు వరంలా మారింది. జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం సీనియర్ అయిన అశ్విన్‌కు ఓటు వేయడంతో అనుకోకుండా వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు

Ravichandran Ashwin
Ravichandran Ashwin : ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) గాయపడడం స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కు వరంలా మారింది. ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ గాయపడడంతో క్రికెట్ పండితులు యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తీసుకుంటారని అనుకున్నారు. అయితే.. జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం సీనియర్ అయిన అశ్విన్‌కు ఓటు వేయడంతో అనుకోకుండా వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు 37 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్.
ఈ క్రమంలో అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆలస్యంగా వన్డే ప్రపంచకప్ జట్టులోకి పిలుపు అందుకోవడం తనకు బాధగా ఏమీ అనిపించడం లేదన్నాడు. అదే సమయంలో టీమ్ఇండియా తరుపున తనకు ఇదే చివరి ప్రపంచకప్ కావొచ్చునని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్ కోసం భారత జట్టు గౌహతి వచ్చింది. ఒక్క బంతి కూడా పడకుండానే వర్షం కారణంగా ఈ వార్మప్ మ్యాచ్ రద్దు అయ్యింది.
అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు విలేకర్ల సమావేశంలో అశ్విన్ మాట్లాడాడు. ప్రపంచకప్ జట్టులో భాగమైనందుకు సంతోషంగానే ఉంది. అయితే.. పిలుపు ఆలస్యంగా వచ్చినందుకు ఏమీ బాధపడడం లేదన్నాడు. ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదించడమే తనకు తెలుసన్నాడు. గత నాలుగు ఐదు సంవత్సరాలుగా తాను ఇదే పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మెగా టోర్నీలలో ఒత్తిడి ఉంటుంది. అయితే.. దాన్ని అధిగమిస్తేనే విజయవంతం అవుతామని తెలిపాడు.
HCA Elections : హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
టీమ్ఇండియాను విజేతగా నిలిపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చాడు. జీవితం అంటే ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉంటాయని, ఈ రోజు తాను ఇక్కడ ఉంటానని ఎవరూ ఊహించి ఉండరన్నారు. జట్టు మేనేజ్‌మెంట్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిరూపించుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా.. అయితే.. ఇదే నా చివరి ప్రపంచకప్ కావొచ్చు. అని రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు.