ODI World Cup 2023: వరల్డ్ కప్ చరిత్రలో చెత్త రికార్డు నమోదు చేసుకున్న ఇంగ్లాండ్.. అదేంటో తెలుసా?

ఇంగ్లాండ్ పేరిట ఓ రికార్డు నమోదైంది.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో మొత్తం 11 టెస్ట్ మ్యాచ్ లు ఆడే దేశాలతో ఓడిపోయిన మొదటి జట్టుగా ఇంగ్లాండ్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

ODI World Cup 2023: వరల్డ్ కప్ చరిత్రలో చెత్త రికార్డు నమోదు చేసుకున్న ఇంగ్లాండ్.. అదేంటో తెలుసా?

England Cricket Team

Updated On : October 16, 2023 / 10:49 AM IST

England Team : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో సంచలనం చోటు చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టుకు పసికూన అప్గానిస్థాన్ జట్టు గట్టి షాకిచ్చింది. అదిరే ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై అఫ్గానిస్థాన్ జ‌ట్టు 69 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 285 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ 40.3 ఓవ‌ర్ల‌లో 215 ప‌రుగుల‌కే ఆలౌటైంది. తాజా ఓటమితో ఇంగ్లాండ్ పేరిట ఓ రికార్డు నమోదైంది.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో మొత్తం 11 టెస్ట్ మ్యాచ్ లు ఆడే దేశాలతో ఓడిపోయిన మొదటి జట్టుగా ఇంగ్లాండ్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

Read Also : World Cup 2023 ENG vs AFG : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పెను సంచ‌ల‌నం.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ పై అఫ్గానిస్థాన్ ఘ‌న విజ‌యం..

మొట్టమొదటి వరల్డ్ కప్ టోర్నీలో అంటే 1975లో ఆస్ట్రేలియా జట్టుపై ఇంగ్లాండ్ ఓటమిని చవిచూసింది. 1979 ప్రపంచ కప్ ఫైనల్ లో వెస్టిండీస్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోయింది. 1983, 1987 ప్రపంచ్ కప్ లలో ఆసియా దిగ్గజాలు భారత్, పాకిస్థాన్ జట్లపై ఇంగ్లాండ్ పరాజయం పాలైంది. అదే సమయంలో 1983లో ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 1992 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ కు ఊహించని ఎదురు దెబ్బతగిలింది. పసికూన జట్టు జింబాబ్వే పై ఓటమి పాలైంది. 1996 వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టుపై, అదే సంవత్సరం టోర్నీలో దక్షిణాఫ్రికా జట్టుపై ఇంగ్లండ్ ఓడిపోయింది. 2011లో బంగ్లాదేశ్ జట్టుపై, అదే సంవత్సరం ఐర్లాండ్ జట్టుపై ఇంగ్లాండ్ ఓడిపోయింది. తాజాగా భారత్ వేదికగా జరుగుతున్న 2023 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పసికూన ఆఫ్గానిస్థాన్ జట్టు చేతిలో ఓటమి చవిచూసింది. దీంతో ప్రపంచ కప్ చరిత్రలో 11 టెస్టు మ్యాచ్ ఆడే దేశాల చేతిలో ఓడిపోయిన జట్టుగా ఇంగ్లండ్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసుకుంది.