ODI World Cup 2023 : నెదర్లాండ్స్ జట్టు సంచలన విజయం.. టీమిండియా మాజీల వరుస ట్వీట్లు.. ఏమన్నారంటే..?

సౌతాఫ్రికా జట్టుకు నెదర్లాండ్స్ జట్టు షాకిచ్చింది. 38 పరుగుల తేడాతో సంచలనం విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 245 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్ట్స్ 68 బంతుల్లో 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

South Africa Vs Netherlands

South Africa Vs Netherlands : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో మరో సంచలనం చోటు చేసుకుంది. గత రెండు రోజుల క్రితం ఇంగ్లాండ్ జట్టును అఫ్గానిస్థాన్ జట్టు ఓడించగా.. మంగళవారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టుకు నెదర్లాండ్స్ జట్టు షాకిచ్చింది. 38 పరుగుల తేడాతో సౌతాఫ్రికా జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 245 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్ట్స్ 68 బంతుల్లో 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 246 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టుకు ఆది నుంచి నెదర్లాండ్స్ బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ఓవర్లు పూర్తికాకుండానే 207 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. వన్డే ప్రపంచ కప్ లో ఓ టెస్టు దేశంపై నెదర్లాండ్స్ కు ఇదే తొలి విజయం. ప్రపంచ కప్ చరిత్రలో ఈ జట్టుకు ఇది మూడో విజయం. ఇంతకుముందు నమీబియా, స్కాట్లాండ్ పై నెదర్లాండ్స్ జట్టు విజయం సాధించింది.

Read Also : ODI World Cup 2023 : ఆస్ట్రేలియాతో కీల‌క మ్యాచ్‌.. పాకిస్థాన్ జట్టులో వైరల్ ఫీవర్ క‌ల‌వ‌రం..!

సౌతాఫ్రికా జట్టుపై నెదర్లాండ్స్ జట్టు సంచలన విజయం సాధిచండం పట్ల టీమిండియా మాజీ ఆటగాళ్లు స్పందించారు. ట్విటర్ వేదికగా ఆసక్తికర ట్వీట్లు చేశారు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ‘వావ్! డచ్ ప్లేయర్స్ అద్భుత ప్రతిభ కనబర్చారు. వారు కొనసాగించిన ఆటతీరు తనకు చాలా నచ్చిందని అన్నారు. స్వాట్ ఎడ్వర్ట్స్ చివరి 10 ఓవర్లలో బ్యాట్ తో సంచలనం సృష్టించాడు. నెదర్లాండ్స్ బౌలర్లు ఆ పనిని స్టైల్ గా చేశారు అటూ నెదర్లాండ్స్ జట్టును సెహ్వాగ్ ప్రశంసించారు.

 

Read Also : ODI World Cup 2023 : నువ్వు ఇలా అంటావ‌ని అనుకోలేదు.. బాబ‌ర్ కెప్టెన్సీపై ర‌గ‌డ‌.. మాలిక్‌ పై మండిప‌డ్డ యూస‌ఫ్

 

టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్పందిస్తూ.. అందమైన ప్రదేశంలో అందమైన గేమ్.. ఇటువంటి ఊహించని ఫలితంతో నెదర్లాండ్స్ ప్లేయర్స్ ఆకట్టుకున్నారని అన్నారు. నెదర్లాండ్స్ వెళ్లే మార్గం తెలివైనది అంటూ దినేశ్ కార్తీక్ ట్వీట్ లో పేర్కొన్నాడు.

 

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పటాన్ నెదర్లాండ్స్ సంచలన విజయంపై ట్వీట్ చేశాడు. నెదర్లాండ్స్ మీ చారిత్రాత్మక విజయానికి చాలా అభినందనలు. మీరు ఆటలో క్రమశిక్షణతో ఉన్నారు. ముఖ్యంగా బౌలింగ్ లో అద్భుతంగా రాణించారు అటూ ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు.