ODI World Cup-2023: తెలుగులో మాట్లాడిన నెదర్లాండ్స్‌ క్రికెటర్.. ఏమన్నాడో తెలుసా?

ఆరెంజ్ అంటే మీకు చాలా ఇష్టం అంటూ ఆయన తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టాడు.

ODI World Cup-2023: తెలుగులో మాట్లాడిన నెదర్లాండ్స్‌ క్రికెటర్.. ఏమన్నాడో తెలుసా?

Teja-Nidamanuru

Updated On : October 6, 2023 / 3:20 PM IST

Teja Nidamanuru: వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్-నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్ ప్రారంభించడానికి ముందు నెదర్లాండ్స్ ఆల్ రౌండర్ తేజ నిడమనూరు తెలుగులో మాట్లాడి అలరించాడు.

హైదరాబాద్.. ఆరెంజ్ అంటే మీకు చాలా ఇష్టం అంటూ ఆయన తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టాడు. తాము పాక్‌తో ఉప్పల్‌లో మ్యాచ్ ఆడుతున్నామని వ్యాఖ్యానించాడు. మైదానానికి వచ్చి తమకు సపోర్ట్ చేయాలని, తాము సంతోషిస్తామని చెప్పాడు.

కాగా, తేజ నిడమనూరు విజయవాడలో జన్మించినప్పటికీ నెదర్లాండ్స్ లో పెరిగాడు. వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్థాన్ ఉప్పల్ లో జరిగిన వార్మప్ మ్యాచులో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అదే మైదానంలో ఇప్పుడు వన్డే ప్రపంచకప్-2023లో పాక్ తొలి వన్డే ఆడుతోంది. మరోవైపు, భారత్ తన తొలి మ్యాచు ఆదివారం ఆస్ట్రేలియాతో ఆడనుంది.

World Cup 2023 PAK vs NED : హైదరాబాద్ లో మ్యాచ్.. ఆరంభంలోనే పాకిస్థాన్ కు బిగ్ షాక్