Pakistan Cricket team: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు

ఈ వార్మప్‌ మ్యాచ్‌ మైదానంలో ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే బీసీసీఐ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.

Pakistan Cricket team: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు

Pakistan Cricket team

Updated On : September 27, 2023 / 9:26 PM IST

World cup 2023: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇవాళ హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకి చేరుకుంది. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ లో జరగనున్న వన్డే ప్రపంచకప్-2023లో ఆ జట్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 29న పాక్ – న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరగనుంది.

ఇందులో ఆడడానికి పాక్ జట్టు హైదరాబాద్ లో ఉండనుంది. ఈ వార్మప్‌ మ్యాచ్‌ మైదానంలో ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే బీసీసీఐ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.

ఒకే రోజున రెండు పండుగలు ఉండడంతో, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసుల సూచనల మేరకు పాక్ – న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచుకు ప్రేక్షకులకు అనుమతించడం లేదు. మ్యాచ్ కోసం బుక్ చేసుకున్న ప్రేక్షకుల డబ్బులను తిరిగి ఇస్తామని బీసీసీఐ ఇప్పటికే తెలిపింది. కాగా, పాకిస్థాన్ అక్టోబరు 6న నెదర్లాండ్స్ తో ప్రపంచకప్ లో తొలి మ్యాచు ఆడనుంది.

Shubman Gill : పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాంకు శుభ్‌మ‌న్ గిల్ టెన్ష‌న్‌..