ODI World Cup 2023 : యూసుఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అఫ్గాన్‌పై ఓట‌మి త‌రువాత డ్రెస్సింగ్ రూమ్‌లో బాబ‌ర్ వెక్కి వెక్కి ఏడ్చాడు..!

యూసుఫ్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అఫ్గానిస్థాన్ పై పాక్ జ‌ట్టు ఓడిన త‌రువాత డ్రెస్సింగ్ రూంలో బాబ‌ర్ ఏడ్చాడ‌నే విష‌యం త‌న‌కు తెలిసింద‌ని చెప్పాడు.

ODI World Cup 2023 : యూసుఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అఫ్గాన్‌పై ఓట‌మి త‌రువాత డ్రెస్సింగ్ రూమ్‌లో బాబ‌ర్ వెక్కి వెక్కి ఏడ్చాడు..!

Yousuf-Babar

ODI World Cup : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాక్ జ‌ట్టు పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఆ జ‌ట్టు కెప్టెన్ బాబ‌ర్ ఆజాం పై మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు అభిమానులు మండిప‌డుతున్నారు. పాక్ ఓట‌మికి అత‌డే కార‌ణం అని వారు అంటున్నారు. అయితే.. ఒక్క‌రు మాత్ర‌మే పాక్ కెప్టెన్ కు అండ‌గా నిలిచారు. అత‌డు మ‌రెవ‌రో కాదు. మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ యూసుఫ్‌. ఓట‌మికి బాబ‌ర్‌ ఒక్క‌డే కార‌ణం కాద‌ని, జ‌ట్టు మొత్తం బాధ్య‌త తీసుకోవాల‌న్నాడు.

ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో యూసుఫ్ మాట్లాడుతూ.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అఫ్గానిస్థాన్ పై పాక్ జ‌ట్టు ఓడిన త‌రువాత డ్రెస్సింగ్ రూంలో బాబ‌ర్ ఏడ్చాడ‌నే విష‌యం త‌న‌కు తెలిసింద‌ని చెప్పాడు. ఈ విష‌యం విన్న త‌రువాత బాధ క‌లిగింద‌న్నాడు. ఓట‌మికి ఎప్పుడు కెప్టెన్ ను మాత్ర‌మే బాధ్యుడిని చేయ‌డం స‌రికాద‌న్నాడు. జ‌ట్టులోని ప్ర‌తీ ఆట‌గాడితో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ కూడా దీనికి బాధ్య‌త వ‌హించాల‌న్నాడు. తాను బాబ‌ర్‌కు అండ‌గా ఉన్న‌ట్లు యూసుఫ్ చెప్పాడు. అంతేకాద‌ని మొత్తం దేశం కూడా అత‌డికి అండ‌గా నిలుస్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు.

ICC ODI Rankings : దుమ్ములేపిన డికాక్‌, క్లాసెన్‌.. అగ్ర‌స్థానానికి మ‌రింత చేరువ‌గా గిల్‌

ఇదిలా ఉంటే.. ఓట‌మి అనంత‌రం బాబ‌ర్ మాట్లాడుతూ బౌలింగ్‌, ఫీల్డింగ్ విభాగాల్లో త‌మ జ‌ట్టు ఫెయిల్ అయ్యింద‌ని బాబ‌ర్ చెప్పుకొచ్చాడు. మిడిల్ ఓవ‌ర్ల‌లో బౌల‌ర్లు వికెట్లు తీయ‌డంలో విఫ‌లం అయ్యారు. ఫీల్డింగ్‌లోనూ త‌ప్పులు చేశాం. ప‌రుగులను క‌ట్ట‌డి చేయ‌లేక‌పోవ‌డ‌మే దెబ్బ‌తీసింద‌న్నాడు. మెగా టోర్నీల్లో ఒక్క విభాగంలో ఫెయిల్ అయినా ఓట‌మి త‌ప్ప‌ద‌న్నాడు.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 282 ప‌రుగులు చేసింది. కెప్టెన్ బాబ‌ర్ ఆజాం (74), అబ్దుల్లా షఫీక్ (58) అర్థ‌శ‌త‌కాలు చేయ‌గా మిగిలిన వారు విప‌లం అయ్యారు. ఇబ్రహీం జద్రాన్ (87), రహమత్ షా (77 నాటౌట్‌), రహమానుల్లా గుర్జాబ్ (65) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించ‌డంతో ల‌క్ష్యాన్ని అఫ్గానిస్థాన్ 49 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది.

Glenn Maxwell : చ‌రిత్ర సృష్టించిన మాక్స్‌వెల్‌.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ