PSL 2024 : పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో గందరగోళం.. అస్వస్థతకు గురైన 13మంది ప్లేయర్స్!

గురువారం పీఎస్ఎల్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ తో కరాచీ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో క్వెట్టా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

PSL 2024 : పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో గందరగోళం.. అస్వస్థతకు గురైన 13మంది ప్లేయర్స్!

Pakistan Super League 2024

Pakistan Super League 2024: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2024 సీజన్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అయితే, గురువారం పీఎస్ఎల్ టోర్నీలో గందరగోళం చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరుకాదు.. ఏకంగా 13 మంది ప్లేయర్లు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా కరాచీ కింగ్స్ జట్టుకు చెందిన వారు కావటంతో టోర్నీలో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమైంది. 13మంది ప్లేయర్స్ లో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆటగాళ్లంతా కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఇలా జరిగిందని గుర్తించారు. ఈ ఘటనతో తుది జట్టు ఎంపికకు టీమ్ మేనేజ్మెంట్ కష్టపడాల్సి వచ్చింది.

Also Read : Ashwin : ధ‌ర్మ‌శాల‌లో సెంచ‌రీ కొట్ట‌బోతున్న అశ్విన్‌, బెయిర్ స్టో.. అరుదైన ఘ‌ట్టం

గురువారం పీఎస్ఎల్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ తో కరాచీ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో క్వెట్టా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే కరాచీ కింగ్స్ జట్టు ప్లేయర్స్ అస్వస్థతకు గురయ్యారు. అయితే, మ్యాచ్ ప్రారంభ సమయానికి కెప్టెన్ షాన్ మసూద్, షోయబ్ మాలిక్, హసన్ అలీతో పాటు కొందరు ఆటగాళ్లు కోలుకున్నారు. దీంతో తుది జట్టులో నాలుగు మార్పులతో కరాచీ కింగ్స్ జట్టు బరిలోకి దిగింది.  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కరాచీ జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత ఓవర్లలో 165 పరుగులు చేసింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెట్టా జట్టు కేవలం ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

Also Read : IND vs ENG 5th Test : ఐదో టెస్టుకు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. బుమ్రా ఇన్‌.. రాహుల్ ఔట్‌.. ఇంకా