Viral Video: స్టీవ్ స్మిత్‌ను పాకిస్థాన్ ఔట్ చేసిన తీరుపై ప్రశంసల జల్లు

స్టీవ్ స్మిత్ ముందుకు వచ్చి రైట్ సైడ్ షాట్ ఆడేలా మిర్ హంజా చాకచక్యంగా బౌలింగ్ చేశాడు. ఫీల్డర్ల ట్రాప్‌లో చిక్కుకోవడం స్టీవ్ స్మిత్ వంతు అయింది.

Viral Video: స్టీవ్ స్మిత్‌ను పాకిస్థాన్ ఔట్ చేసిన తీరుపై ప్రశంసల జల్లు

Australia vs Pakistan

Updated On : January 6, 2024 / 9:44 AM IST

పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను పాకిస్థాన్ ఔట్ చేసిన తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

చాలా చక్కని ప్రణాళిక వేసుకుని స్మీవ్ స్మిత్‌ను క్యాచ్ ఔట్ చేసింది పాకిస్థాన్ జట్టు. తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ సమయంలో పాక్ కెప్టెన్ మసూద్ కవర్స్‌లో ముగ్గురు ఫీల్డర్లను ఉంచాడు. మిర్ హంజా బౌలింగ్ చేస్తున్నాడు.

స్టీవ్ స్మిత్ ముందుకు వచ్చి రైట్ సైడ్ షాట్ ఆడేలా మిర్ హంజా చాకచక్యంగా బౌలింగ్ వేశాడు. ఫీల్డర్ల ట్రాప్‌లో చిక్కుకోవడం స్టీవ్ స్మిత్ వంతు అయింది. బంతి నేరుగా బాబర్ అజాం వద్దకు వెళ్లింది. క్యాచ్ ఔట్‌గా స్టీవ్ స్మిత్ వెనుదిరిగాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 86 బంతులు ఆడిన స్టీవ్ స్మిత్ 38 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా, ఈ మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 313 రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులు చేసి ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు స్కోరు 130/2గా నమోదైంది. దీంతో ఆస్ట్రేలియా గెలుపొందింది.