రిటైర్ మెంట్ ప్రకటనపై ప్లాన్..బాగా ఏడ్చామన్న రైనా

రిటైర్ మెంట్ ఎప్పుడు ప్రకటించాలనే దానిపై భారత మాజీ కెప్టెన్ ధోని, డాషింగ్ లెప్టాండర్ బ్యాట్స్ మెన్ రైనా ప్లాన్ వేసుకున్నారంట. ఈ విషయాన్ని రైనా వెల్లడించాడు. ఆగస్టు 15వ తేదీని అంర్జాతీయ క్రికేట్ కు గుడ్ బై చెప్పాలని ముందుగానే డిసైడ్ అయ్యామని, ధోని జెర్సీ సంఖ్య 7. తనది 3. ఇవి పక్కనపెడితే..73 అవుతుంది.
ఈ ఆగస్టు 15న భారత్ 73 వసంతాల స్వాతంత్రం పూర్తి చేసుకుందనే విషయన్ని ఆయన గుర్తు చేశారు. తమ రిటైర్ మెంట్ నిర్ణయం ప్రకటనకు ఇంతకంటే మంచి రోజు ఉండదని భావించామన్నారు. రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన తర్వాత..కన్నీళ్లు పెట్టుకున్నానని, చెన్నై చేసిన తర్వాత..ధోని రిటైర్ మెంట్ ప్రకటిస్తాడని తనకు ముందే తెలుసన్నారు.
వీడ్కోలు ప్రకటించిన అనంతరం..ధోనిని హత్తుకుని ఏడ్చానన్నారు. అనంతరం పీయూష్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, కర్ణ్ శర్మ కలిసి విందు చేసుకుని..కెరీర్లపై చర్చించుకున్నామన్నారు. మరోవైపు రిటైర్ మెంట్ ప్రకటించిన తర్వాత..తమకు అధికారిక సమాచారం అందిందని బీసీసీఐ వెల్లడించింది.