ఎండతీవ్రతకు నిలిచిన మ్యాచ్, తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
న్యూజిలాండ్ గడ్డపై ఆతిథ్యజట్టుతో 158 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(11) వికెట్‌ను కోల్పోయింది. బ్రాస్ వెల్ ఆఫ్ సైడ్‌కు అవతల వేసిన షార్ట్ లెంగ్త్ డెలివరీని రోహిత్ ఎదుర్కోవడంలో ఆలస్యమైంది.

న్యూజిలాండ్ గడ్డపై ఆతిథ్యజట్టుతో 158 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(11) వికెట్‌ను కోల్పోయింది. బ్రాస్ వెల్ ఆఫ్ సైడ్‌కు అవతల వేసిన షార్ట్ లెంగ్త్ డెలివరీని రోహిత్ ఎదుర్కోవడంలో ఆలస్యమైంది. దీంతో బంతి లోన్ స్లిప్ ఫీల్డర్ మార్టిన్ గఫ్తిల్ చేతికి చిక్కింది. ఇలా టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోగా క్రీజులో శిఖర్ ధావన్(29), విరాట్ కోహ్లీ(2)లు ఉన్నారు.
ఎండతీవ్రతకు నిలిచిపోయిన మ్యాచ్:
వెలుతురు తక్కువగానో, వర్షం కారణంగానో కాదు ఎండ తీవ్రత కూడా మ్యాచ్‌ను ఆపేయగలదని మరోసారి ఋజువైంది. నేపియర్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఎండ నేరుగా బ్యాట్స్‌మన్ కంటి మీద పడుతుండటంతో బంతి కనిపించడం లేదని మ్యాచ్‌ను ఆపారు. న్యూజిలాండ్‌లోని మైదానాలు దాదాపు ఉత్తర-దక్షిణ ముఖాలను కలిగి ఉంటాయి. కేవలం మెక్ లీన్ పార్క్ మాత్రమే తూర్పు-పడమర అభిముఖంగా ఉండడం దాని ప్రత్యేకత.