స్మృతి మంధానకు గాయం: వన్డేల నుంచి తొలగింపు

స్మృతి మంధానకు గాయం: వన్డేల నుంచి తొలగింపు

Updated On : October 9, 2019 / 11:21 AM IST

టీమిండియా ఉమెన్ ఓపెనర్ స్మృతి మంధాన గాయం కారణంగా వన్డేల నుంచి తప్పించారు. మంగళవారం తన కుడి కాలి బొటనవేలికి గాయం అయింది. దీంతో ఆమె స్థానంలో బౌలింగ్ ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్‌ను తీసుకోనున్నారు. మంధానకు భారత్ నుంచే కాదు.. అంతర్జాతీయంగా అభిమానులు ఉన్నారు. మంధాన గాయంతో తప్పుకుంటున్న విషయాన్ని ఐసీసీనే స్వయంగా వెల్లడించింది.

‘స్మృతి మంధాన, ఎమ్మారెఫ్ వరల్డ్ వైడ్ మహిళా వన్డే ర్యాంకుల్లో నెం.1 స్థానాన్ని దక్కించుకున్న భారత ఓపెనింగ్ బ్యాట్స్ ఉమెన్ గాయానికి గురైంది. దీంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ నుంచి తప్పుకోనుంది. ఆమె స్థానాన్ని సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ భర్తీ చేయనున్నారు’ అని ఐసీసీ ట్వీట్ చేసింది. అక్టోబర్ 9నుంచి భారత్.. దక్షిణాఫ్రికాల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. 

భారత జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), తానియా భాటియా (వికెట్ కీపర్), ఏక్తా బిష్ట్, రాజేశ్వరి గైక్వాడ్, జులాన్ గోస్వామి, దయాలన్ హేమలత, మాన్సీ జోషి, పూజ వస్త్రకర్, శిఖా పాండే, పూనమ్ పాదూ, పూనమ్ రావువ్. జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ