Prithvi Shaw : టీమ్ఇండియాలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో.. పృథ్వీ షా కీల‌క నిర్ణ‌యం..!

టీమ్ఇండియా యువ ఆట‌గాడు పృథ్వీ షా (Prithvi Shaw) కు గ‌త కొంత‌కాలంగా క‌లిసి రావ‌డం లేదు. పేల‌వ ఫామ్‌తో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో భార‌త జ‌ట్టుకు ఎంపిక కాలేక‌పోతున్నాడు. అ

Prithvi Shaw : టీమ్ఇండియాలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో.. పృథ్వీ షా కీల‌క నిర్ణ‌యం..!

Prithvi Shaw

Updated On : July 2, 2023 / 8:35 PM IST

Prithvi Shaw plays county cricket : టీమ్ఇండియా యువ ఆట‌గాడు పృథ్వీ షా (Prithvi Shaw) కు గ‌త కొంత‌కాలంగా క‌లిసి రావ‌డం లేదు. పేల‌వ ఫామ్‌తో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో భార‌త జ‌ట్టుకు ఎంపిక కాలేక‌పోతున్నాడు. అదే స‌మ‌యంలో రుతురాజ్ గైక్వాడ్‌(Ruturaj Gaikwad), య‌శ‌స్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal), శుభ్‌మ‌న్ గిల్‌(Shubman Gill)లు అద‌ర‌గొడుతుండ‌డంతో ఓపెనర్ అయిన పృథ్వీ షాను సెల‌క్ట‌ర్లు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనా తుది జ‌ట్టులో ఆడే అవ‌కాశం మాత్రం రాలేదు. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లోనూ ఘోరంగా విప‌లం అయ్యాడు. ఈ క్ర‌మంలో పృథ్వీ షా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇంగ్లాండ్‌కు వెళ్లి కౌంటీ క్రికెట్ ఆడాల‌ని బావిస్తున్నాడట‌. ఇప్ప‌టికే నార్తాంప్టన్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడ‌ని, ఆగ‌స్టులో ప్రారంభ‌మ‌య్యే రాయ‌ల్ లండ‌న్ వ‌న్డే క‌ప్‌లో కూడా భాగ‌స్వామ్యం కానున్న‌ట్లు ఓ ఆంగ్ల మీడియా వెల్ల‌డించింది. దులీప్ ట్రోఫీ ముగిసిన వెంట‌నే అత‌డు కౌంటీ ఆడేందుకు వెళ్ల‌నున్నాడని తెలిపింది. షా కౌంటీల్లో ఆడ‌డం ఇదే తొలిసారి.

Ashes : గాయం వేధిస్తున్నా.. కుంటుతూనే క్రీజులోకి.. లేచి నిల‌బ‌డి చ‌ప్ప‌ట్లు కొట్టిన ప్రేక్ష‌కులు.. అయితే..

దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు షా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. సెంట్ర‌ల్ జోన్‌తో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నున్నాడు. ఒక‌వేళ సెమీఫైన‌ల్‌లో వెస్ట్ జోన్ గెలిచి ఫైన‌ల్ చేరుకుంటే జూలై 12 నుంచి 16 జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్ కూడా ఆడ‌నున్నాడు. ఆ త‌రువాత కౌంటీలు ఆడేందుకు వెళ్ల‌నున్నాడు. చివ‌రిసారిగా పృథ్వీ షా 2021లో శ్రీలంక‌పై ఆడాడు. పృథ్వీ షా ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా త‌రుపున 5 టెస్టులు, 6 వ‌న్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 339, వ‌న్డేల్లో 189 ప‌రుగులు చేయ‌గా, ఆడిన ఒక్క టీ20 మ్యాచులో డ‌కౌట్ అయ్యాడు.

ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఆడాడు పృథ్వీ షా. మొద‌టి ఆరు గేమ్స్‌ల‌లో ఘోరంగా విఫ‌లం అయ్యాడు. దీంతో కొన్ని మ్యాచుల‌కు ఢిల్లీ అత‌డిని దూరం పెట్టింది. ఆ త‌రువాత చివ‌రి మ్యాచుల్లో అవ‌కాశం రాగానే అర్థ‌శ‌త‌కం చేశాడు. మొత్తంగా 8 మ్యాచుల్లో 106 ప‌రుగులు చేశాడు.

WI vs IND : భార‌త్‌తో టెస్టు సిరీస్‌.. సీనియ‌ర్లు దూరం.. వెస్టిండీస్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్‌గా బ్రాత్‌వైట్‌

ఛ‌తేశ్వర్ పుజారా (ససెక్స్), అజింక్యా రహానే (లీసెస్టర్‌షైర్), అర్ష్‌దీప్ సింగ్ (కెంట్), నవదీప్ సైనీ (వోర్సెస్టర్‌షైర్) తర్వాత అతను 2022-23 కౌంటీ సీజన్‌లో భాగ‌మవుతున్న ఐదో భారతఆట‌గాడు.