WI vs IND : భారత్‌తో టెస్టు సిరీస్.. సీనియర్లు దూరం.. వెస్టిండీస్ జట్టు ఇదే.. కెప్టెన్‌గా బ్రాత్‌వైట్
టీమ్ఇండియాతో సొంత గడ్డపై ఆడే టెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కొంత మంది సీనియర్ ఆటగాళ్లు వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ ఆడుతుండడంతో వారిని ఎంపిక చేయలేదు.

West Indies squad
West Indies vs India : టీమ్ఇండియాతో సొంత గడ్డపై ఆడే టెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కొంత మంది సీనియర్ ఆటగాళ్లు వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ ఆడుతుండడంతో వారిని ఎంపిక చేయలేదు. యువ ఆటగాళ్లకు చోటు ఇచ్చింది. మొత్తం 18 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ప్రకటించింది. క్రెగ్ బ్రాత్‌వైట్ (Brathwaite) విండీస్ జట్టును నడిపించనున్నాడు.
జాసన్ హోల్డర్, కేల్ మేయర్స్, అల్జారీ జోసెఫ్ లు క్వాలిఫయర్ టోర్నీ ఆడుతుండడంతో వారి స్థానాల్లో కావెమ్ హోడ్గే, అలిక్ అతానాజ్, జైయిర్ మెక్‌అలిస్టర్ లను ఎంపిక చేసింది. జూలై 9 నాటికి విండీస్ జట్టు మొత్తం తొలి టెస్టు మ్యాచ్ ఆడే డొమినికాకు చేరుకుంటుందని తెలిపింది. భారత్, విండీస్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. తొలి టెస్టు మ్యాచ్ జూలై 12 నుంచి ప్రారంభం కానుంది. విండీస్ ప్రకటించిన జట్టులో క్రెగ్ బ్రాత్‌వైట్, టాగెనరైన్ చంద్రపాల్, కీమర్ రోచ్, బ్లాక్‌వుడ్ వంటి ఆటగాళ్లు తప్ప మిగిలిన వారు పెద్దగా భారత అభిమానులకు తెలియదు.
భారత్‌తో తలపడే విండీస్ జట్టు ఇదే..
క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అతానాజ్, బ్లాక్‌వుడ్, బోనెర్, టాగెనరైన్ చంద్రపాల్, రహ్‌కీమ్ చంద్రపాల్, జాషువా సిల్వా, గాబ్రియల్, కావెమ్ హోడ్గే, అకీమ్ జోర్డాన్, జైయర్, కిర్క్ మెకెన్జీ, మిండ్లే, అండర్సన్ ఫిలిప్, రీఫెర్, కీమర్ రోచ్, జయ్‌దేన్ సీల్స్, వారికన్
SQUAD: Kraigg Brathwaite (captain), Alick Athanaze, Jermaine Blackwood, Nkrumah Bonner, Tagenarine Chanderpaul, Rahkeem Cornwall
Joshua Da Silva, Shannon Gabriel, Kavem Hodge, Akeem Jordan, Jair McAllister, Kirk McKenzie, Marquino Mindley, Anderson Phillip (continued…)— Windies Cricket (@windiescricket) June 29, 2023
గవాస్కర్ ఆగ్రహాం..
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడడం వల్ల టీమ్ఇండియాకు వచ్చే ప్రమోజనం ఏంటని భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. వ్యక్తిగత ప్రదర్శనలు, సెంచరీలతో ఆటగాళ్ల రికార్డులు మెరుగుపరచుకోవడం తప్ప పెద్దగా ఉపయోగం ఉండదని వెల్లడించాడు. సీనియర్ ఆటగాళ్లకు బదులు కుర్రాళ్లను పంపితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. సీనియర్ ఆటగాళ్లు వన్డే ప్రపంచకప్ పై ఫోకస్ పెడితే బాగుండేదని అన్నాడు.
WI Vs Ind : విడతల వారీగా విండీస్‌కు పయనమైన భారత ఆటగాళ్లు.. రోహిత్, కోహ్లి లేకుండానే..
ఇప్పటికే భారత్, వెస్టిండీస్ టెస్టు సిరీస్‌పై ఓ పక్కన విమర్శలు వెల్లువెత్తుతుండగా విండీస్ జట్టు యువ ఆటగాళ్లను ఎంపిక చేయడం పుండు మీదు కారం చల్లినట్లుగా ఉంది.