3 నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి పృథ్వీ షా
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా మూణ్నెల్ల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో గాయం కారణంగా స్వదేశానికి తిరిగొచ్చేసిన పృథ్వీ.

భారత యువ క్రికెటర్ పృథ్వీ షా మూణ్నెల్ల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో గాయం కారణంగా స్వదేశానికి తిరిగొచ్చేసిన పృథ్వీ.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా మూణ్నెల్ల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో గాయం కారణంగా స్వదేశానికి తిరిగొచ్చేసిన పృథ్వీ.. ఫిట్‌నెస్ మెరుగుపరుచుకుని బరిలోకి దిగేందుకు సిద్ధమైయ్యాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు వార్మప్ మ్యాచ్‌లో పృథ్వీ ప్రమాదానికి గురైయ్యాడు. క్యాచ్ అందుకునే క్రమంలో బౌండరీ లైన్ వద్ద నియంత్రణ కోల్పోయి కిందపడ్డాడు. ఎడమకాలిపైనే శరీర బరువంతా పడడంతో కాలిమండకు గాయమైంది. వెంటనే ప్రథమ చికిత్స చేసినా తీవ్రంగా గాయంకావడంతో ఫిజియోలు ఆసుపత్రికి తరలించారు.
తొలి టెస్టుకు మాత్రం దూరమవుతాడని మిగిలిన మ్యాచ్‌లలో ఆడతాడని భావించిన టీమిండియా మేనేజ్‌మెంట్‌కు నిరాశే మిగిలింది. షా కోలుకునేందుకు చాలా సమయమే తీసుకున్నాడు. తిరిగి ఫిట్‌నెస్ సాధించిన షా షా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టి సత్తా చాటేందుకు సిద్ధమైయ్యాడు. ప్రపంచ కప్‌కు ముందు టెస్టు మ్యాచ్‌లేమీ లేవు. ప్రపంచ కప్ ట్రోఫీతో కలిపి పరిమిత ఓవర్ల సిరీస్ పూర్తయ్యేసరికి జులై వరకూ సమయం పడుతుంది. ఈ లోపు షా ఫిట్‌నెస్ సాధించాలి.
ఫిబ్రవరి 24 నుంచి భారత్.. ఆస్ట్రేలియాతో 2 టీ20లు, 5 వన్డేలు ఆడనుంది. ఈ ఫార్మాట్‌లలో ఆడటానికి పృథ్వీ షా ఇంకా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనపై స్పందించిన పృథ్వీ.. ‘ఆస్ట్రేలియా లాంటి అత్యుత్తమ బౌలింగ్ లైనప్‌ని ఎదుర్కోలేకపోయినందుకు చాలా బాధపడుతున్నా. కెరీర్ ఆరంభంలోనే వచ్చిన చక్కటి అవకాశం.. గాయం కారణంగా దూరమవడం కొంచెం నిరాశను కలిగించాయి. ఇప్పుడు నా దృష్టంతా త్వరలో జరగనున్న ముస్తక్ అలీ టోర్నీమెంట్‌పైనే ఉంది’ అని పృథ్వీ షా వెల్లడించాడు.
Also Read : హ్యాట్రిక్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన హనుమవిహారీ
Also Read : షాక్ నుంచి తేరుకుని విషాదంతో కోహ్లీ ట్వీట్
Also Read : ఐసీసీ ట్వీట్: సోలో లైఫే సూపర్.. సింగిల్‌గానే ఉండు
Also Read : వెరీ చీప్ : జియో 4జీ డేటా ప్లాన్ వోచర్లు ఇవే