Pro Panja League 2023: కిరాక్‌ హైదరాబాద్‌ ఖతర్నాక్‌ విజయాలు

లుధియాన లయన్స్‌తో అండర్‌ కార్డ్‌ మ్యాచుల్లో కిరాక్‌ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్లు క్లీన్‌స్వీప్‌ చేశారు.

Pro Panja League 2023: కిరాక్‌ హైదరాబాద్‌ ఖతర్నాక్‌ విజయాలు

Pro Panja League 2023

Updated On : August 5, 2023 / 2:08 PM IST

Pro Panja League 2023 – Arm Wrestling: న్యూఢిల్లీ(New Delhi)లోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో కొనసాగుతున్న ప్రొ పంజా లీగ్‌ (ఆర్మ్‌ రెజ్లింగ్‌) తొలి సీజన్‌ లో కిరాక్‌ హైదరాబాద్‌ (Kiraak Hyderabad) జట్టు ఖతర్నాక్‌ విజయాలు సాధించింది. శుక్రవార గ్రూప్‌ దశ మ్యాచ్‌లో లుధియాన లయన్స్‌పై 18-10తో ఏకపక్ష విజయం సాధించింది. ఈ పోటీలను చూడడానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వచ్చారు.

Pro Panja League 2023


Pro Panja League 2023

అండర్‌ కార్డ్‌, మెయిన్‌ కార్డ్‌లో ఆధిపత్యం చూపించిన కిరాక్‌ హైదరాబాద్‌ లీగ్‌లో నాలుగో విజయం నమోదు చేసింది. లీగ్‌లో తన తర్వాతి మ్యాచ్‌ను కిరాక్‌ హైదరాబాద్‌ ఆగస్టు 7న (సోమవారం) బరోడా బాద్‌షాస్‌తో ఆడనుంది. ప్రొ పంజా లీగ్‌లో నాలుగో విజయం సాధించిన కిరాక్‌ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్లను ప్రాంఛైజీ యజమాని నెదురుమల్లి గౌతం రెడ్డి, సీఈవో త్రినాథ్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.

Pro Panja League 2023


Pro Panja League 2023

లుధియాన లయన్స్‌తో అండర్‌ కార్డ్‌ మ్యాచుల్లో కిరాక్‌ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్లు క్లీన్‌స్వీప్‌ చేశారు. మూడు మ్యచుల్లోనూ 1-0తో విజయాలు సాధించి హైదరాబాద్‌కు 3-0 ఆధిక్యం కట్టబెట్టారు. స్పెషల్‌ కేటగిరీ మ్యాచులో భుట్టా సింగ్‌, మహిళల 65 కేజీల విభాగంలో కెఎన్‌ మధుర, 60 కేజీల విభాగంలో షోయబ్ అక్తర్‌లు సత్తా చాటారు.

ఇటు మెయిన్‌ కార్డ్‌ మ్యాచుల్లోనూ కిరాక్‌ హైదరాబాద్‌ జోరు కొనసాగింది. మెన్స్‌ 70 కేజీల విభాగంలో సత్నాం సింగ్‌ 0-10తో తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. దీంతో కిరాక్‌ హైదరాబాద్‌ 3-10తో వెనుకంజలో నిలిచింది. అయితే, ఆ తర్వాత 2 మ్యాచుల్లోనూ కిరాక్‌ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్లు తమ సత్తా చూపించారు.

మహిళల 65 కేజీల విభాగంలో కెఎన్‌ మధుర వరుసగా రెండో మ్యాచ్‌లో డబుల్‌ ధమాకా అందించింది. అండర్‌ కార్డ్‌లో మెరిసిన మదుర.. మెయిన్‌ కార్డ్‌లోనూ అపర్ణ రోషిత్‌పై 10-0తో విజృంభించింది. దీంతో కిరాక్‌ హైదరాబాద్‌ 13-10తో మళ్లీ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో జగదీశ్‌ బారు (మెన్స్‌ 100 కేజీల విభాగం) అదరగొట్టాడు. సచిన్‌ బడోరియపై 5-0తో విజయం సాధించి.. కిరాక్‌ హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు.

MS Dhoni’s Daughter Ziva : ధోని కుమార్తె జీవా ఏ స్కూల్‌లో చదువుతుందంటే…ఆ స్కూలు ఫీజు తెలిస్తే షాక్ అవుతారు