అదిరిపోయే డ్రెస్సులు: సింధు, సైనాల ర్యాంప్ వాక్

అదిరిపోయే డ్రెస్సులు: సింధు, సైనాల ర్యాంప్ వాక్

Updated On : February 6, 2019 / 9:04 AM IST

ముంబై వేదికగా జరిగిన ఫ్యాషన్ షోలో ప్రముఖ మోడల్స్‌తో పాటు బ్యాడ్మింటన్ తారలు పీవి సింధు, సైనా నెహ్వాల్‌లు కూడా మెరిశారు. లాక్మే ఫ్యాషన్ వీక్‌‌లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ర్యాంప్ వాక్ చేస్తూ.. సింధు, సైనాలు సందడి చేశారు. మోకాలి పై వరకూ ఉన్న తెలుపు రంగు దుస్తుల్లో సింధు మెరవగా.. ఇటీవల వివాహం చేసుకున్న సైనా నెహ్వాల్ పసుపు రంగు లెహెంగాలో తళుక్కుమంది. వీరితో పాటు రెజ్లర్ గీతా ఫొగట్ సైతం ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

 

1999 నుంచి ప్రతి ఏటా ముంబైలో లాక్మే ఫ్యాషన్ వీక్ జరుగుతోంది. ఐఎంజీ రిలయన్స్‌ లిమిటెడ్‌, లాక్మే సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. తొలి సారిగా లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న సింధు ఉత్సాహంగా కనిపించింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ కూడా హాజరయ్యారు. అతనితో సెల్ఫీ దిగిన సింధు.. ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేసి.. గల్లీబాయ్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పింది.