Rahul Dravid : ప్రపపంచ కప్ తుది జట్టులో అశ్విన్‌కు చోటు దక్కుతుందా? ద్రవిడ్ ఏం చెప్పారంటే?

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను ఇదే విషయంపై మీడియా ప్రశ్నించింది. వన్డే వరల్డ్ కప్‌లో రవిచంద్ర అశ్విన్ కు చోటు దక్కుతుందా అని ప్రశ్నించగా..

Rahul Dravid : ప్రపపంచ కప్ తుది జట్టులో అశ్విన్‌కు చోటు దక్కుతుందా? ద్రవిడ్ ఏం చెప్పారంటే?

Ravichandran Ashwin,

Updated On : September 28, 2023 / 2:20 PM IST

India head coach Rahul Dravid: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. ఈ మెగా ఈవెంట్‌లో సత్తాచాటేందుకు జట్లు సన్నద్ధమవుతున్నాయి. స్వదేశంలో జరిగే మెగా టోర్నీలో విజేతగా నిలిచేందుకు భారత్ జట్టు కసరత్తు చేస్తోంది. శుక్రవారం నుంచి వార్మప్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం.. ప్రపంచ కప్ కోసం బరిలోకి దిగే స్వ్కాడ్ లో మార్పులు చేసుకొనే ఛాన్స్ కు నేటితో లాస్ట్ డేట్. దీంతో భారత్ జట్టులో స్పిన్ బౌలర్ రవిచంద్ర అశ్విన్ ఎంట్రీపై చర్చ జరుగుతుంది.

Rohit Sharma : విన్నింగ్ ట్రోఫీని వ‌ద్ద‌న్న‌ రోహిత్ శ‌ర్మ‌.. వీడియో వైర‌ల్‌.. నెట్టింట ప్ర‌శంస‌ల జ‌ల్లు

ఇప్పటికే భారత్ జట్టు 15 మందితో కూడిన జట్టును ప్రపంచ కప్ కోసం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నాడు. అయితే, ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో అక్షర పటేల్ గాయపడటంతో ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఆడలేక పోయాడు. అతని స్థానంలో అశ్విన్ ఆసీస్ వన్డే సిరీస్‌లో బరిలోకి దిగాడు. మొదటి రెండు మ్యాచ్ లు ఆడాడు. చివరి వన్డే మ్యాచ్ లో అశ్విన్ కు విశ్రాంతినిచ్చిన టీమిండియా మేనేజ్ మెంట్ వాషింగ్టన్ సుందర్ ను బరిలోకి దింపింది. గాయం నుంచి ఇంకాకోలుకోలేదని తెలుస్తోంది. ఈ  కారణంగా ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ నుంచి కూడా అక్షర్ పటేల్ తప్పుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే, మెగా టోర్నీకి తుది జట్టులో మార్పులుచేర్పులకు నేటితో అవకాశం ముగియనుండటంతో.. అక్షర పటేల్ స్థానంలో అశ్విన్‌కు చోటు దక్కుతుందన్న చర్చ జరుగుతుంది. అదేవిధంగా వాసింగ్టన్ సుందర్ పేరుకూడా తెరపైకి వచ్చింది.

World Cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. వరల్డ్‌కప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్?

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను ఇదే విషయంపై మీడియా ప్రశ్నించింది. వన్డే వరల్డ్ కప్‌లో రవిచంద్ర అశ్విన్ కు చోటు దక్కుతుందా అని ప్రశ్నించగా.. రాహుల్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తుది జట్టుకోసం మేమంతా వేచి ఉన్నాం. ఎన్‌సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ)తో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బృందం టచ్‌లో ఉంది. కాబట్టి నేనే దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను. ఏదైనా మార్పు ఉంటే మేనేజ్‌మెంట్ వెల్లడిస్తుంది.. మీరుకూడా దాని గురించి అధికారికంగా వినవచ్చు. ప్రస్తుతానికి అయితే ఎలాంటి మార్పులు లేవు అని ద్రవిడ్ పేర్కొన్నారు.