Jos Buttler : ఆర్ఆర్ బ్యాటర్ జోస్ బట్లర్ కు జరిమానా.. మ్యాచ్ ఫీజులో కోత

ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 బట్లర్ ఉల్లంఘించినట్లు ఐపీఎల్ వెల్లడించింది. మ్యాచ్ రిఫరీ ప్రకారం అతనికి శిక్ష పడింది.

Jos Buttler : ఆర్ఆర్ బ్యాటర్ జోస్ బట్లర్ కు జరిమానా.. మ్యాచ్ ఫీజులో కోత

Jos Buttler

Updated On : May 13, 2023 / 7:13 PM IST

Jos Buttler : రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ కు జరిమానా విధించారు. జోస్ బట్లర్ కు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పెట్టారు. కోల్ కతాలో జరిగిన మ్యాచ్ లో జోస్ బట్లర్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. యశస్వి జైస్వాల్ తో ఓపెనింగ్ కు వచ్చిన బట్లర్ ఆరంభంలోనే రనౌట్ అయ్యారు.

ఇంగ్లాండ్ బ్యాటర్ వద్దు అంటూ చేయితో సంకేతం ఇస్తున్నా నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న జైస్వాల్ అలాగే పరుగెత్తుకుంటూ వచ్చారు. ఇక దిక్కు తోచని స్థితిలో బట్లర్ రన్ కోసం పరుగెత్తారు. కానీ రనౌట్ కావాల్సి వచ్చింది.  ఆ సమయంలో బట్లర్ ఆగ్రహానికి గురయ్యారు.

Yashasvi Jaiswal: బట్లర్ రనౌట్ పై యశస్వి జైశ్వాల్ ఏమన్నాడో తెలుసా..!

ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 బట్లర్ ఉల్లంఘించినట్లు ఐపీఎల్ వెల్లడించింది. మ్యాచ్ రిఫరీ ప్రకారం అతనికి శిక్ష పడింది. దీంతో అతని ఫీజులో 10 శాతం కోత విధించింది. ఈ మ్యాచ్ లో మొదట కేకేఆర్ 8 వికెట్లు నష్టానికి 149 రన్స్ చేసింది.

అయితే, ఆ టార్గెట్ ను కేవలం 13.1 ఓవర్లలోనే రాజస్థాన్ రాయల్స్ సాధించింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జైస్వాల్ వీర విహారం చేశారు. అతను కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఆర్ఆర్ కు భారీ విజయాన్ని తెచ్చిపెట్టారు.