ICC ODI Rankings : రోహిత్ శ‌ర్మ 2 అప్‌.. కోహ్లీ వ‌న్ డౌన్‌.. కుల్దీప్ త్రీ అప్‌..

తాజాగా ఐసీసీ వ‌న్డే ర్యాంక్సింగ్స్‌ను ప్ర‌క‌టించింది.

ICC ODI Rankings : రోహిత్ శ‌ర్మ 2 అప్‌.. కోహ్లీ వ‌న్ డౌన్‌.. కుల్దీప్ త్రీ అప్‌..

Rankings rise for Champions Trophy finalists following India thrilling victory

Updated On : March 12, 2025 / 4:49 PM IST

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత‌గా భార‌త్ నిలిచింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మూడోసారి ఛాంపియ‌న్స్ ట్రోఫీని ముద్దాడింది. ఈ క్ర‌మంలో ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన వ‌న్డే ర్యాంక్సింగ్స్‌లోనూ భార‌త ఆట‌గాళ్లు దూసుకువెళ్లారు.

ముఖ్యంగా ఫైన‌ల్ మ్యాచ్‌లో 76 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఏకంగా రెండు స్థానాలు మెరుగుప‌ర‌చుకుని టాప్‌-3లోకి దూసుకువ‌చ్చాడు. ఇక టీమ్ఇండియా ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ త‌న అగ్ర‌స్థానాన్ని కాపాడుకున్నాడు. పాక్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజామ్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఫైన‌ల్ మ్యాచ్‌లో విఫ‌లం అయిన కోహ్లీ ఓ స్థానం దిగ‌జారి ఐదో స్థానానికి ప‌డిపోయాడు.

Yuzvendra Chahal : ఐపీఎల్ 2025లో కొత్త అవ‌తారం ఎత్త‌నున్న చాహ‌ల్‌.. కోచ్ పాంటింగ్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు..

ఐసీసీ వ‌న్డే టాప్‌-5 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌..
శుభ్‌మ‌న్ గిల్ (భార‌త్‌) – 784 రేటింగ్ పాయింట్లు
బాబ‌ర్ ఆజామ్ (పాకిస్థాన్‌) – 770 రేటింగ్ పాయింట్లు
రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 756 రేటింగ్ పాయింట్లు
హెన్రిచ్ క్లాసెన్ (ద‌క్షిణాప్రికా) – 744 రేటింగ్ పాయింట్లు
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 736 రేటింగ్ పాయింట్లు

Hardik Pandya : కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఒక్క ఫోటోతో..

ఇక బౌల‌ర్ల విష‌యానికి వ‌స్తే.. చైనామ‌న్ బౌల‌ర్ కుల్దీప్ యాద‌వ్ మూడు స్థానాలు ఎగ‌బాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్ ఏకంగా ఆరు స్థానాలు ఎగ‌బాకి రెండులోకి దూసుకువ‌చ్చాడు. శ్రీలంక స్పిన్న‌ర్ మ‌హేశ్ తీక్ష‌ణ అగ్ర‌స్థానంలోనే కొన‌సాగుతున్నాడు. ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మూడు స్థానాలు ఎగ‌బాకి టాప్‌-10లో ఉన్నాడు.

ఐసీసీ వ‌న్డే టాప్‌-5 బౌల‌ర్ల‌ ర్యాంకింగ్స్‌..
మ‌హేశ్ తీక్ష‌ణ (శ్రీలంక‌) – 680 రేటింగ్ పాయింట్లు
మిచెల్ సాంట్న‌ర్ (న్యూజిలాండ్‌) – 657 రేటింగ్ పాయింట్లు
కుల్దీప్ యాద‌వ్ (భార‌త్)- 650 రేటింగ్ పాయింట్లు
కేశ‌వ్ మ‌హ‌రాజ్ (ద‌క్షిణాప్రికా) – 648 రేటింగ్ పాయింట్లు
బెర్నార్డ్ స్కాల్ట్జ్ (నమీబియా) – 646 రేటింగ్ పాయింట్లు

Gautam Gambhir : ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజ‌యం త‌రువాత‌.. గౌత‌మ్ గంభీర్ కీల‌క నిర్ణ‌యం.. ఆట‌గాళ్లు జ‌ర జాగ్ర‌త్త‌..!

ఇక ఆల్‌రౌండ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. ర‌వీంద్ర జడేజా 220 రేటింగ్ పాయింట్ల‌తో ప‌దో స్థానంలో ఉన్నాడు. అఫ్గాన్ ఆట‌గాడు అజ్మ‌తుల్లా ఒమ‌ర్జాయ్ 296 రేటింగ్ పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు.