కోట్లాది రూపాయలు.. భారత స్టార్ క్రికెటర్ల సంపాదనపై రవి శాస్త్రి షాకింగ్ కామెంట్స్‌.. వీరికి వస్తున్న డబ్బు గురించి తెలిస్తే..

ఆటగాళ్ల ఆదాయం గురించే కాకుండా, భారత క్రికెట్ జట్టు కోచ్‌లకు కూడా భారీగా వేతనాలు అందుతాయనే విషయాన్ని శాస్త్రి ప్రస్తావించారు.

కోట్లాది రూపాయలు.. భారత స్టార్ క్రికెటర్ల సంపాదనపై రవి శాస్త్రి షాకింగ్ కామెంట్స్‌.. వీరికి వస్తున్న డబ్బు గురించి తెలిస్తే..

Ravi Shastri

Updated On : July 22, 2025 / 7:37 PM IST

భారత మాజీ కోచ్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు రవి శాస్త్రి భారత క్రికెటర్ల సంపాదనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “ది ఓవర్‌ల్యాప్ క్రికెట్” ప్రోగ్రాంలో మైఖేల్ వాగన్, అలాస్టెర్ కుక్‌తో పాల్గొన్న ఆయన.. స్టార్ క్రికెటర్ల వార్షిక ఆదాయం ఎంత ఉంటుందనే ప్రశ్నకు ఊహించని సమాధానం ఇచ్చారు. మైఖేల్ వాగన్, అలాస్టెర్ కుక్‌ సైతం ఆశ్చర్యపోయే వివరాలు తెలిపారు. అగ్రశ్రేణి ఆటగాళ్లు సంవత్సరానికి సుమారు రూ.100 కోట్లకు పైగానే సంపాదిస్తున్నారని శాస్త్రి వెల్లడించారు.

ధోనీ, కోహ్లీ భారీ ఆదాయం
ధోనీ, కోహ్లీలాంటి స్టార్‌ ప్లేయర్లు మనం ఊహిస్తున్న దానికంటే ఎంతో ఎక్కువగానే సంపాదిస్తున్నారని రవి శాస్త్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా ధోనీ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు ప్రకటనల ద్వారానే భారీగా ఆర్జిస్తున్నారని తెలిపారు.

“పెద్ద మొత్తంలో ఆదాయం ఉంటుంది. బ్రాండ్ ప్రమోషన్ల ద్వారానే ఎక్కువ సంపాదన వస్తుంది. అది సుమారుగా రూ.100 కోట్ల వరకు ఉంటుంది. ధోనీ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటివారు తమ ప్రైమ్ టైమ్‌లో 15-20 చొప్పున ప్రకటనలు చేస్తుంటారు. అంటే అన్ని కంపెనీలతో ఒప్పందాలు ఉంటాయి. నిజానికి రోజుకు ఒక ప్రకటన షూటింగ్ ఉండేది. క్రికెట్ షెడ్యూల్ కారణంగా చాలా బిజీగా ఉన్నా కూడా రోజుకు ఒక్క షూటింగ్‌కు సమయం ఇస్తారు, అది సంవత్సరమంతా వారికి ఆదాయం తెచ్చిపెడుతుంది” అని శాస్త్రి వివరించారు.

Also Read: 4వ టెస్ట్.. వర్షం పడుతుందా? పిచ్‌ రిపోర్ట్‌, ప్రివ్యూ, ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

కోచ్‌ల జీతాలు
ఆటగాళ్ల ఆదాయమే కాకుండా, భారత క్రికెట్ జట్టు కోచ్‌లకు కూడా భారీగా వేతనాలు అందుతాయనే విషయాన్ని శాస్త్రి ప్రస్తావించారు. రవి శాస్త్రి భారత కోచ్‌గా అప్పట్లో ఒప్పందం ప్రకారం వార్షికంగా సుమారుగా రూ.9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వేతనం పొందేవారు. సహాయక కోచ్‌లు భరత్ అరుణ్ (బౌలింగ్ కోచ్) సుమారు రూ.3.5 కోట్ల వరకు, విక్రమ్ రాథోర్ (బ్యాటింగ్ కోచ్) రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు జీతాలు అందుకునేవారు.

వాషింగ్టన్ సుందర్‌పై ప్రశంసలు
భారత యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై రవి శాస్త్రి ప్రశంసలు కురిపించారు. అతడికి బంతితో ప్రత్యర్థులను దెబ్బతీసే సామర్థ్యంతో పాటు, క్లిష్ట పరిస్థితుల్లో బ్యాట్‌తోనూ రాణించే “పటిష్ఠమైన బ్యాట్స్‌మన్” అని కొనియాడారు. వాషింగ్టన్ సుందర్ ఇప్పటివరకు ఆడిన 11 టెస్టుల్లో 545 పరుగులు చేసి, 30 వికెట్లు పడగొట్టాడు. సుందర్‌కు ఇంకా ఎక్కువ అవకాశాలు లభించకపోవడంపై శాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అతడికి మరిన్ని టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఇవ్వాలని సూచించారు.

మొత్తంగా, రవి శాస్త్రి వ్యాఖ్యలు భారత క్రికెట్ ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉందో, ముఖ్యంగా స్టార్ ప్లేయర్‌లు కేవలం ఆట ద్వారానే కాకుండా, ప్రకటనల ద్వారా అపారమైన సంపదను ఎలా కూడబెట్టుకుంటున్నారో స్పష్టం చేస్తున్నాయి. అలాగే, యువ ప్రతిభావంతులకు సరైన అవకాశాలు లభిస్తే వారు కూడా ఉన్నత స్థాయికి చేరుకోగలరనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.