వైభవ్ సూర్యవంశీ త్వరలోనే భారత సీనియర్ జట్టులో ఆడతాడు.. ఎందుకంటే?: రవిశాస్త్రి
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో టీమిండియా టెస్టు మ్యాచు ఆడుతున్న వేళ రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.

vaibhav suryavanshi
యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ(14)పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించారు. క్రికెట్‌లో వైభవ్ నిరంతరం ఆటతీరును మెరుగుపర్చుకుంటుండడం చూస్తుంటే త్వరలోనే అతడు సీనియర్ జట్టులో ఆడే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోందని అన్నారు.
“అతడు భవిష్యత్తులో ఫస్ట్‌క్లాస్‌లో క్రికెట్ ఆడతాడు. టాలెంట్‌ను నిరూపించుకోవడానికి అతడికి ఐపీఎల్ ఓ వేదిక అయింది. దేశం మొత్తం అతడిని చూస్తుంది. అందరి అంచనాలను అందుకుంటాడు” అని రవిశాస్త్రి అన్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో టీమిండియా టెస్టు మ్యాచు ఆడుతున్న వేళ రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడి మొదటి రెండు సీజన్లలో శతకాలు సాధిస్తే వైభవ్ వేగంగా పై స్థాయికి వస్తాడని రవిశాస్త్రి చెప్పారు. “వైభవ్ ఇప్పటికే అందరి దృష్టిలో పడ్డాడు. 14 ఏళ్ల వయస్సులో అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు. మైదానంలో చెలరేగిపోతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలతో వచ్చిన అనుభవంతో మరింత మెరుగవుతాడు” అని రవిశాస్త్రి తెలిపారు.
ఇంగ్లాండ్‌లో దుమ్ముదులిపిన వైభవ్
వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై 78 బంతుల్లో 143 పరుగులు చేసి అదరగొట్టాడు. 13 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో రాణించాడు. దీంతో భారత్ స్కోర్ 363/9గా నమోదైంది. కేవలం 52 బంతుల్లో శతకం సాధించి రికార్డు నమోదుచేసుకున్న విషయం తెలిసిందే.
దశాబ్దం క్రితం 2013లో పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ ఘులాంలు నెలకొల్పిన (53 బంతుల్లో శతకం) రికార్డును అధిగమించాడు. అంతేకాదు, ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయస్సులో అరంగేట్రం చేసిన ఆటగాడు వైభవ్. గుజరాత్ టైటాన్స్‌పై అతడు శతకం సాధించాడు. కేవలం 35 బంతుల్లో శతకం సాధించి క్రిస్ గేల్ (30 బంతుల్లో శతకం) తరువాతి స్థానాన్ని దక్కించుకున్నాడు.