Ravindra Jadeja : జ‌డేజా మామూలోడు కాదుగా..! ధోనినే వెన‌క్కి నెట్టాడు..

చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా చ‌రిత్ర సృష్టించాడు.

Ravindra Jadeja : జ‌డేజా మామూలోడు కాదుగా..! ధోనినే వెన‌క్కి నెట్టాడు..

PIC credit @ CSK

Ravindra Jadeja – MS Dhoni : చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా చ‌రిత్ర సృష్టించాడు. ఆదివారం పంజాబ్‌కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టాడు. మొద‌ట బ్యాటింగ్‌లో 43 ప‌రుగులు చేసిన జ‌డ్డూ.. ఆపై బౌలింగ్‌లో చెల‌రేగి 3 వికెట్లు తీసి పంజాబ్ పై సీఎస్‌కేకు అద్భుత విజ‌యాన్ని అందించాడు. ఈ విజ‌యంతో చెన్నై ప్లే ఆఫ్స్‌కు మ‌రింత చేరువైంది. ఈ మ్యాచ్ చెన్నై గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన జడేజాకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.

చెన్నై తరపున అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ఆటగాడిగా రవీంద్ర జడేజా రికార్డుల‌కు ఎక్కాడు ఈ క్ర‌మంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ధోని ఇప్ప‌టి వ‌ర‌కు 15 సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో క‌లిపి జ‌డేజా ఖాతాలో 16 అవార్డులు వ‌చ్చి చేరాయి. ఇక ఈ జాబితాలో వీరిద్ద‌రి త‌రువాత స్థానాల్లో రైనా, రుతురాజ్‌, హ‌స్సీ లు ఉన్నారు.

Sanju Samson : రాహుల్ ద్ర‌విడ్‌తో శ్రీశాంత్ చెప్పిన అబ‌ద్దం.. సంజూ శాంస‌న్ కెరీర్‌ను మార్చేసిందా?

సీఎస్‌కే త‌రుపున అత్య‌ధిక సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయ‌ర్లు..

ర‌వీంద్ర జ‌డేజా – 16 సార్లు
ఎంఎస్ ధోని – 15
సురేశ్ రైనా – 12
రుతురాజ్ గైక్వాడ్ – 11
మైక్ హ‌స్సీ – 11

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 167 ప‌రుగులు చేసింది. ర‌వీంద్ర జ‌డేజా (26 బంతుల్లో 43), రుతురాజ్ గైక్వాడ్ (21 బంతుల్లో 32), డారిల్ మిచెల్ (19 బంతుల్లో 30) లు రాణించారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో రాహుల్ చాహ‌ర్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ లు చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. అర్ష్‌దీప్ సింగ్ రెండు విక‌ట్లు తీశాడు. సామ్ క‌ర్రాన్ ఓ వికెట్ సాధించాడు.

Preity Zinta : తొలి బంతికి ధోని క్లీన్‌బౌల్డ్‌.. వామ్మో ప్రీతి జింటా ఇలా చేస్తుంద‌నుకోలేదు!

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 139 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. దీంతో 28 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్రభసిమ్రాన్ సింగ్ (23 బంతుల్లో 30), శ‌శాంక్ సింగ్ (20 బంతుల్లో 27) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా మూడు వికెట్లు తీశాడు. తుషార్ దేశ్ పాండే, సిమర్‌జీత్ సింగ్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. మిచెల్ శాంట్న‌ర్‌, శార్దూల్ ఠాకూర్ లు ఒక్కొ వికెట్ తీశారు.