Team India : టీ20 ప్రపంచకప్.. న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కనున్న భారత ఆటగాళ్లు.. ఏ తేదీనో తెలుసా..?
పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లు రెండు బృందాలుగా అమెరికాకు చేరుకుంటారు.

PIC Credit : BCCI
Team India – T20 World Cup 2024 : ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఈ పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లు రెండు బృందాలుగా అమెరికాకు చేరుకుంటారు. తొలి విడుత బృందం మే 25న న్యూయార్క్ వెళ్లనుండగా రెండో బృందం మే 27న విమానం ఎక్కనుంది.
మొదటి విడుతలో జట్టు సహాయక సిబ్బందితో పాటు ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైన జట్లలోని టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన ఆటగాళ్లు న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కుతారు. వాస్తవానికి వీరంతా వీరంతా మే 21నే బయలుదేరాల్సి ఉండగా నాలుగు రోజులు ఆలస్యంగా వెలుతున్నారు.
Arjun Tendulkar : సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌కు కోపమొచ్చింది..!
కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ లతో పాటు మరికొందరు ఆటగాళ్లు సహాయక సిబ్బందితో కలిసి తొలి విడుతలో వెళ్లనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు పీటీఐ తెలిపింది.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 26న జరగనుంది. ఈ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు అంటే మే 27న మిగిలిన ఆటగాళ్లు అమెరికాకు పయనం కానున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు జూన్ 1న బంగ్లాదేశ్‌తో టీమ్ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు కనీసం మూడు నుంచి నాలుగు నెట్ సెషన్లలలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు.
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జూన్ 9న జరగనుంది.
టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన భారత ఆటగాళ్లు..
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.