ఈసారి కూడా కప్ లేనట్లేనా..! మళ్లీ ఓడిన ఆర్సీబీ.. ఫ్యాన్స్ ఫైర్

లక్నో జట్టుపై ఓటమి తరువాత సోషల్ మీడియాలో ఆర్సీబీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈసారి కూడా కప్ లేనట్లేనా..! మళ్లీ ఓడిన ఆర్సీబీ.. ఫ్యాన్స్ ఫైర్

RCB virat kohli

IPL 2024 RCB : ఐపీఎల్ 2024 సీజన్ లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు పేలవ ప్రదర్శనతో వరుస ఓటములను చవిచూస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోపీ విజేతగా నిలవలేక పోయింది. అయితే, ఐపీఎల్ 2024 విజేత కచ్చితంగా ఆర్సీబీ జట్టేనని ఆ జట్టు అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ మహిళల జట్టు ట్రోపీ విజేతగా నిలిచింది. ఆ స్ఫూర్తితో ఐపీఎల్ లోనూ ఆర్సీబీ జట్టు విజేతగా నిలుస్తుందని భావించారు. కానీ, ప్రస్తుతం జట్టు ప్లేయర్ల ప్రదర్శన చూసి.. ఆర్సీబీ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.

Also Read : ఆర్సీబీ బ్యాటర్లను బెంబేలెత్తించిన మయాంక్ యాదవ్.. 2024 సీజన్‌లో సరికొత్త రికార్డు

ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీ జట్టు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడింది. అందులో మూడింటిలో ఓడిపోవటం గమనార్హం. కేవలం ఒక్క మ్యాచ్ లోనే ఆర్సీబీ జట్టు విజేతగా నిలిచింది. ఈ జట్టులో కోహ్లీ, డు ప్లెసిస్, రజత్ పటీదార్, మ్యాక్స్ వెల్, స్టాయినిస్, దినేశ్ కార్తీక్, సిరాజ్, టాప్లీ వంటి అనుభవం కలిగిన క్రికెటర్లు ఉన్నారు. మిగిలిన జట్ల కంటే బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో బలమైన జట్టుగా ఆర్సీబీ ఉంది. అయినా ఆ జట్టు వరుసగా ఓటములను చవిచూస్తుండటంతో ఆర్సీబీ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మ్యాక్స్ వెల్, కోహ్లీ, డు ప్లెసిస్ లలో ఒక్కరు రాణించినా ఆర్సీబీ జట్టు భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కరూ కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలవలేక పోతున్నారు.

Also Read : IPL 2024 : రెండు మ్యాచ్‌ల‌ను రీ షెడ్యూల్ చేసిన బీసీసీఐ

లక్నో జట్టుపై ఓటమి తరువాత సోషల్ మీడియాలో ఆర్సీబీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కప్ గెలవలేదు. ఈ సంవత్సరం కూడా మనకు కప్ లభించక పోవచ్చు అంటూ.. జట్టు ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ ఆర్‌సీబీకి అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ ఉంది. 2016 నుండి ఒక్కసారి కూడా 190+ స్కోరును విజయవంతంగా ఛేజ్ చేయలేక పోయిందని పేర్కొన్నాడు. లక్నోపై ఓటమితో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ చివరి స్థానంలోకి వెళ్లిపోయింది.