Sophie Devine : బాబోయ్.. 33 బంతుల్లోనే 99 పరుగులు.. డివైన్ విధ్వంసం, బెంగళూరు ఘన విజయం

బెంగళూరు అమ్మాయిలు అదరగొట్టారు. గుజరాత్ పై విజయం సాధించారు. గుజరాత్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో భారీ గెలుపు అందుకున్నారు. 189 పరుగుల టార్గెట్ ను కేవలం 2 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది ఆర్సీబీ. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

Sophie Devine : బాబోయ్.. 33 బంతుల్లోనే 99 పరుగులు.. డివైన్ విధ్వంసం, బెంగళూరు ఘన విజయం

Updated On : March 19, 2023 / 11:27 AM IST

Sophie Devine : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో భాగంగా శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు అమ్మాయిలు అదరగొట్టారు. గుజరాత్ పై విజయం సాధించారు. గుజరాత్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో భారీ గెలుపు అందుకున్నారు. 189 పరుగుల టార్గెట్ ను కేవలం 2 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది ఆర్సీబీ. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

బెంగళూరు ఓపెనర్ సోఫీ డివైన్ విధ్వంసకర బ్యాటింగ్ ఆడింది. ఆరంభం నుంచే రెచ్చిపోయింది. మెరుపు బ్యాటింగ్ తో మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేసింది. అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో అలరించిన సోఫీ డివైన్ కేవలం 36 బంతుల్లోనే 99 పరుగులు చేసిందంటే.. ఏ రేంజ్ లో చెలరేగిపోయిందో అర్థమవుతుంది. అదిరిపోయే షాట్లు, బౌండరీలతో గుజరాత్ బౌలర్లను ఊచకోత కోసిన సోఫీ సెంచరీకి ఒక పరుగు దూరంలో ఔటైంది. ఆమె స్కోరులో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.

Also Read..Kane Williamson: కేన్ విలియమ్సన్ వీరబాదుడు.. సచిన్, సెహ్వాగ్ సరసన కివీస్ బ్యాటర్

ఓవైపు సోఫీ విధ్వంసం కొనసాగుతుండగా, మరో ఎండ్ లో కెప్టెన్ స్మృతి మందన (37) తన వంతు సహకారం అందించింది. వీరిద్దరూ ఔటైనా, ఎలిస్ పెర్రీ (19 నాటౌట్), హీదర్ నైట్ (22 నాటౌట్) జోడీ ఆర్సీబీని విజయతీరాలకు చేర్చింది.

Also Read..IND vs AUS 1st ODI: అలా వదిలేస్తే ఎలా..! కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై కోహ్లీ అసహనం.. వీడియో వైరల్

వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన ఆర్సీబీ.. మార్చి 15న యూపీ వారియర్స్ తో జరిగిన పోరులో గెలిచి గెలుపు బోణీ కొట్టింది. ఇప్పుడు గుజరాత్ జెయింట్స్ పైనా నెగ్గి టోర్నీలో రెండో విజయం నమోదు చేసింది. ఈ విజయంతో ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.