Rishabh Pant: అందుకే కారు ప్రమాదానికి గురయ్యాను: డీడీసీఏ డైరెక్టర్‌కు చెప్పిన రిషబ్ పంత్

Rishabh Pant
Rishabh Pant: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర కారు ప్రమాదానికి గురైన ఘటనలో మరో విషయం బయటకు వచ్చింది. రోడ్లపై గుంతను తప్పించే క్రమంలో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని జాతీయ మీడియా పేర్కొంది. నిద్రమత్తు వల్లే రిషబ్ పంత్ కారును డివైడర్ కు బలంగా ఢీ కొట్టడానికి పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే.
అయితే, తాజాగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రిషబ్ పంత్ ను ఢిల్లీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ కలిసి మాట్లాడారు. ఆ సమయంలో శ్యామ్ శర్మతో పంత్ తనకు యాక్సిడెంట్ జరిగిన తీరును వివరించాడు. అనంతరం శ్యామ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ… కారులో వెళ్తున్న సమయంలో రోడ్డుపై గుంత అడ్డుగా ఉందని, దాన్ని తప్పించే క్రమంలో కారు డివైడర్ కు ఢీ కొట్టిందని రిషబ్ పంత్ తనతో చెప్పాడని అన్నారు.
అంతేగానీ, రిషబ్ పంత్ డ్రైవింగ్ చేస్తోన్న సమయంలో నిద్రపోలేదని చెప్పారు. రిషబ్ పంత్ కు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. అతడి చికిత్స అయ్యే ఖర్చును అంతా ఉత్తరాఖండ్ ప్రభుత్వ భరిస్తోంది. రిషబ్ పంత్ ను చూసేందుకు పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వెళ్తున్నారు.