Champions Trophy 2025: పాక్‌కు షాక్.. బంగ్లా నెత్తిన పాలు పోసిన వర్షం.. ఆ డబ్బంతా ఇప్పుడు..
పాకిస్థాన్ ఖాతాలోనూ ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. రన్‌రేట్ తక్కువగా ఉండడంతో ఆ జట్టు నాలుగో స్థానంలో ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి పాకిస్థాన్ అవమానకర రీతిలో వెనుదిరిగింది. కనీసం ఒక్క మ్యాచులోనైనా విజయం సాధించకుండానే ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. గురువారం భారత్, బంగ్లా జట్ల మధ్య జరగాల్సిన నామమాత్రపు మ్యాచు కూడా వర్షార్పణం అయిన విషయం తెలిసిందే.
గ్రూప్ ఏలో పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఆ టీమ్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న టీమిండియా ఖాతాలోనూ నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఇక బంగ్లా ఖాతాలో ఒక్క పాయింట్ ఉంది.
ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ ఖాతాలోనూ ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. రన్‌రేట్ తక్కువగా ఉండడంతో ఆ జట్టు నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు చివరి స్థానంలో ఉండడంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అందాల్సిన ప్రైజ్‌మనీ బంగ్లాదేశ్ కంటే తక్కువగా రానుంది.
ఈ ట్రోఫీలో విజేత టీమ్‌కు రూ.19.45 కోట్లు, రన్నరప్‌కు రూ.9.72 కోట్లు ప్రైజ్‌మనీ ఇస్తారు. ఇక సెమీఫైనల్‌లో ఓడే టీమ్స్‌కు రూ.4.86 కోట్ల చొప్పున దక్కుతాయి. 5, 6వ స్థానాల్లో ఉండే జట్లకు రూ.3.04 కోట్ల చొప్పున వస్తాయి. 7,8వ స్థానాల్లో ఉండే టీమ్స్ రూ.1.21 కోట్లు అందుకుంటాయి.
పాక్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండడంతో పాకిస్థాన్ 7 లేదా 8వ స్థానంతోనే సరిపెట్టుకుంటోంది. దీంతో పాకిస్థాన్ జట్టుకు కేవలం రూ.1.22 కోట్లే రానున్నాయి. ఇక 5, 6వ స్థానాల్లో ఉండే జట్లకు రూ.3.04 కోట్ల చొప్పున వస్తాయి. కాబట్టి బంగ్లాదేశ్ పాక్ కంటే బాగానే అందే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఏయే టీమ్ ఏయే స్థానాల్లో ఉన్నాయన్న విషయం కచ్చితంగా తెలియాలంటే గ్రూప్ బీలోని మ్యాచులు కూడా ముగియాలి.