Ricky Ponting hit by grapes : ద్రాక్ష పండ్లతో రికీ పాంటింగ్ పై దాడి.. కోపంతో ర‌గిలిపోయిన ఆసీస్ మాజీ కెప్టెన్.. ప‌ట్టుకోవాలంటూ..!

ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య యాషెస్ సిరీస్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇప్ప‌టికే యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా రీటైన్ చేసుకుంది. అయితే.. సిరీస్‌ను డ్రా చేసేందుకు ఇంగ్లాండ్ ప్ర‌య‌త్నిస్తోంది.

Ricky Ponting hit by grapes : ద్రాక్ష పండ్లతో రికీ పాంటింగ్ పై దాడి.. కోపంతో ర‌గిలిపోయిన ఆసీస్ మాజీ కెప్టెన్.. ప‌ట్టుకోవాలంటూ..!

Ricky Ponting hit by grapes

Ricky Ponting : ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య యాషెస్ సిరీస్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇప్ప‌టికే యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా రీటైన్ చేసుకుంది. అయితే.. సిరీస్‌ను డ్రా చేసేందుకు ఇంగ్లాండ్ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య గురువారం(జూలై 27) నుంచి ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది. తొలి రోజు మ్యాచ్ ముగిసిన త‌రువాత ఆస్ట్రేలియా మాజీ ఆట‌గాడు, క్రికెట్ వ్యాఖ్యాత‌ రికీ పాంటింగ్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది.

మొద‌టి రోజు ఆట ముగిసిన త‌రువాత మైదానంలోకి వ‌చ్చిన పాంటింగ్ మ్యాచ్ ఎలా జ‌రిగింది అన్న దానిపై విశ్లేష‌ణ చేస్తున్న స‌మ‌యంలో స్టాండ్స్‌లో ఉన్న అభిమానుల్లోంచి ఓ వ్య‌క్తి పాంటింగ్ వైపు ద్రాక్ష పండ్ల‌ను విసిరాడు. కొన్ని పాంటింగ్ షూ వ‌ద్ద ప‌డ‌గా మ‌రికొన్ని అత‌డిని తాకాయి. ఈ ఘ‌ట‌న‌పై పాంటింగ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

Rohit Sharma lose cool : శార్దూల్ ఠాకూర్ పై రోహిత్ శ‌ర్మ సీరియ‌స్‌.. మరీ అంత బద్దకమా.. పాత రోజులు గుర్తుకు వ‌చ్చాయి

వెంట‌నే స‌ద‌రు వ్య‌క్తిని ప‌ట్టుకోవాల్సిందిగా అక్క‌డే ఉన్న సెక్యూరిటీని కోరాడు. ఇది క్ష‌మించ‌రాని చ‌ర్య అని, ఆ వ్య‌క్తిని ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దిలే ప్ర‌సక్తే లేద‌న్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎవరైనా స‌రే ఇలా చేయ‌డం ప‌ద్ద‌తి కాదంటూ నెటీజ‌న్లు పాంటింగ్‌కు మ‌ద్ద‌తుగా కామెంట్లు చేస్తున్నారు.

ECS Czechia T10 : కొంప‌ముంచిన కీప‌ర్‌.. క్రికెట్‌లో ఫుట్‌బాల్.. చూస్తే న‌వ్వాపు కోలేరు.. ర‌నౌట్ మిస్‌.. మ్యాచ్ పాయె..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 283 ప‌రుగుల‌కు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (85) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌గా రూట్‌(5), బెన్ స్టోక్స్‌(3), బెయిర్ స్టో(4) ఘోరంగా విఫ‌లం అయ్యారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్ నాలుగు వికెట్లు తీయ‌గా, హేజిల్ వుడ్‌, మ‌ర్ఫీ చెరో రెండు, క‌మిన్స్‌, మిచెల్ మార్ష్ తలా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆస్ట్రేలియా మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోయి 61 ప‌రుగులు చేసింది. డేవిడ్ వార్న‌ర్ (24) ఔట్ కాగా.. ఉస్మాన్ ఖ‌వాజా (26), లబుషేన్‌(2) క్రీజులో ఉన్నారు. ఆసీస్ ఇంకా 222 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.