ECS Czechia T10 : కొంప‌ముంచిన కీప‌ర్‌.. క్రికెట్‌లో ఫుట్‌బాల్.. చూస్తే న‌వ్వాపు కోలేరు.. ర‌నౌట్ మిస్‌.. మ్యాచ్ పాయె..

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కావొచ్చు లేదా ప్రాంఛైజీ లీగ్‌ల్లో కావొచ్చు ఓవ‌ర్ త్రో లు అనేవి చాలా క‌ష్టం. ఎప్పుడో ఒక‌సారి జ‌రుగుతుంటాయి. అయితే.. యూరోపియ‌న్ క్రికెట్ లీగ్‌లో ఓవ‌ర్ త్రో లు స‌ర్వసాధార‌ణంగా మారాయి.

ECS Czechia T10 : కొంప‌ముంచిన కీప‌ర్‌.. క్రికెట్‌లో ఫుట్‌బాల్.. చూస్తే న‌వ్వాపు కోలేరు.. ర‌నౌట్ మిస్‌.. మ్యాచ్ పాయె..

Wicketkeeper Tries Football Shot

Updated On : July 26, 2023 / 10:12 PM IST

ECS Czechia T10 : అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కావొచ్చు లేదా ప్రాంఛైజీ లీగ్‌ల్లో కావొచ్చు ఓవ‌ర్ త్రో(అవుట్‌ఫీల్డ్ నుండి విసిరిన బంతిని మధ్యలో ఉన్న ఫీల్డర్ సేకరించనందున బ్యాటర్ చేసిన అదనపు పరుగు) లు అనేవి చాలా క‌ష్టం. ఎప్పుడో ఒక‌సారి జ‌రుగుతుంటాయి. అయితే.. యూరోపియ‌న్ క్రికెట్ లీగ్‌లో ఓవ‌ర్ త్రో లు స‌ర్వసాధార‌ణంగా మారాయి. ఈ క్ర‌మంలో ప‌లు స‌ర‌దా ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి.

బ్యాట‌ర్ ను ఈజీగా ర‌నౌట్ చేసే అవ‌కాశాన్ని వికెట్ కీప‌ర్ చేజార్చాడు. బంతిని చేతితో ప‌ట్టుకోకుండా ఫుట్‌బాల్ త‌ర‌హాలో కాలితో త‌న్నాడు. దీంతో ర‌నౌట్ మిస్ అవ్వ‌డంతో పాటు మ్యాచ్ కూడా ఓడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వీడియో చూసిన నెటీజ‌న్లు ప‌డి ప‌డి న‌వ్వుడంతో పాటు ఏంట్రీ బ్రో ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Syazrul Idrus : టీ20ల్లో చ‌రిత్ర సృష్టించిన మ‌లేషియా పేస‌ర్‌.. హేమాహేమీల‌కు సాధ్యం కాలేదు

యునైటెడ్ క్రికెట్ క్లబ్, ప్రేగ్ టైగర్స్ జ‌ట్ల మ‌ధ్య టీ10 మ్యాచ్ జ‌రిగింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన టైగ‌ర్స్ అమీన్ హొస్సేన్ (20), సోజిబ్ మియా (30) రాణించడంతో నిర్ణీత 10 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. పీయూష్‌సింగ్ బఘెల్ 23 బంతుల్లో 42 పరుగులతో స‌త్తాచాట‌డంతో యునైటైడ్ 9.5 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది.

కొంప‌ముంచిన కీప‌ర్‌..

యునైటైడ్ విజ‌యానికి రెండు బంతుల్లో మూడు ప‌రుగులు అవ‌స‌రం. టైగ‌ర్స్ బౌల‌ర్ బౌలింగ్ వేయ‌గా స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట‌ర్ బంతిని కొట్ట‌డంలో విఫ‌లం అయ్యాడు. అయిన‌ప్ప‌టికీ బై రూపంలో ప‌రుగు తీసేందుకు బ్యాట‌ర్లు ప్ర‌య‌త్నించారు. అయితే.. కీప‌ర్ బంతిని చేతిలో ప‌ట్టుకోకుండా కాలుతో స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న వికెట్ల‌ను ప‌డ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నించి విఫలం అయ్యాడు. బంతికి ఫీల్డ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లోగా బ్యాట‌ర్లు ఓ ప‌రుగు పూర్తి చేశారు. అదే స‌మ‌యంలో బంతిని అందుకున్న ఫీల్డ‌ర్ బౌల‌ర్ వైపుకు బంతిని విస‌ర‌గా అత‌డు మిస్ చేశాడు. దీంతో యునైటైడ్ బ్యాట‌ర్లు మ‌రో ప‌రుగు కోసం ప్ర‌య‌త్నిస్తారు.

Indian cricketers complain to BCCI : నిద్ర లేదు మ‌హా ప్ర‌భో.. మ‌రోసారి ఇలా చేయ‌కండి.. బీసీసీఐకి భార‌త క్రికెట‌ర్ల ఫిర్యాదు..!

మ‌రో ఫీల్డ‌ర్ బంతిని అందుకుని ఈ సారి కీప‌ర్ వైపుకు విసురుతాడు. అయితే బౌన్స్ అయిన బంతి అక్క‌డే ఉన్న ఫీల్డ‌ర్‌, కీప‌ర్‌కు అంద‌కుండా బౌండ‌రీకి వెలుతోంది. దీంతో యునైటైడ్ జ‌ట్టు విజ‌యం సాధించింది.


MS Dhoni Driving Luxury Car : పాత‌కాలం నాటి ల‌గ్జ‌రీ కారులో ధోని చ‌క్క‌ర్లు.. ప‌క్క‌న ఎవ‌రు కూర్చున్నారో తెలుసా..?