Rinku Singh : రింకూ సింగ్‌కు అండ‌ర్ వ‌ర‌ల్డ్ బెదిరింపులు..! రూ.5 కోట్లు డిమాండ్ ?

రింకూ సింగ్‌కు (Rinku Singh) అండ‌ర్ వ‌ర‌ల్డ్ నుంచి బెదిరింపులు వ‌చ్చాయి.

Rinku Singh : రింకూ సింగ్‌కు అండ‌ర్ వ‌ర‌ల్డ్ బెదిరింపులు..! రూ.5 కోట్లు డిమాండ్ ?

Rinku Singh receives threat from underworld Report

Updated On : October 9, 2025 / 2:26 PM IST

Rinku Singh : టీమ్ఇండియా న‌యా ఫినిష‌ర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్‌కు అండ‌ర్ వ‌ర‌ల్డ్ నుంచి బెదిరింపులు వ‌చ్చాయి. రూ.5 కోట్లు ఇవ్వాల‌ని వారు డిమాండ్ చేశారు. ఈ విష‌యాన్ని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్ల‌డించిన‌ట్లు ఆంగ్ల మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

రింకూ సింగ్‌కు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ఏప్రిల్ మ‌ధ్య కాలంలో మూడు సార్లు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. వారు అత‌డిని రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. దీనిపై రింకూ ఫిర్యాదు చేయ‌గా.. ఈ కేసును సంబంధించి మొహమ్మద్‌ దిల్షద్‌, మొహమ్మద్‌ నవీద్ అనే ఇద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Telugu Titans : ప్రో క‌బ‌డ్డీ లీగ్ సీజ‌న్ 2025లో దుమ్ములేపుతున్న తెలుగు టైటాన్స్‌.. వ‌రుస‌గా ఐదో విజ‌యం..

వీరు క‌రేబియ‌న్ దీవి (వెస్టిండీస్‌)లో నివ‌సిస్తుండ‌గా.. ఆగ‌స్ట్ 1న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసుల‌కు అధికారులు అప్ప‌గించారు. ఇక విచార‌ణ‌లో వీరు రింకూను బెదిరించిన‌ట్లు ఒప్పుకున్నారు. కాగా.. గ‌తంలో వీరిద్ద‌రు ఇటీవల ముంబైలో హత్య చేయబడ్డ ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ కొడుకు జీషన్‌ సిద్దిఖీ నుంచి కూడా రూ.10కోట్లు డిమాండ్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ ప్రాంతానికి చెందిన రింకూ సింగ్ ఐపీఎల్ 2023 ద్వారా వెలుగులోకి వ‌చ్చాడు. గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన ఓ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌రుపున ఆఖ‌రి ఓవ‌ర్‌లో చివ‌రి ఐదు బంతుల‌కు ఐదు సిక్స‌ర్లు కొట్టి త‌న జ‌ట్టుకు న‌మ్మ‌శ‌క్యంగాని విజ‌యాన్ని అందించాడు. ఆ త‌రువాత 2024లో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు.

Mohammed Shami : డోలాయమానంలో షమీ కెరీర్‌.. ‘నా చేతుల్లో ఏమీ లేదు.. ఆ ఇద్ద‌రు క‌రుణించాల్సిందే..’ గిల్‌కు వ‌న్డే కెప్టెన్సీపై కీల‌క వ్యాఖ్య‌లు..

ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ త‌రుపున 34 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 42.31 స‌గ‌టు 161.8 స్ట్రైక్‌రేటుతో 550 ప‌రుగులు చేశాడు. ఇటీవ‌ల జ‌రిగిన పాకిస్తాన్‌తో జరిగిన ఆసియాక‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఫోర్ కొట్టి భార‌త్ తొమ్మిదో సారి క‌ప్పును కైవ‌సం చేసుకోవ‌డంలో సాయ‌ప‌డ్డాడు.