RR vs LSG Match Prediction : ల‌క్నోతో మ్యాచ్ ఓడిపోతే రాజ‌స్థాన్ ఇంటికేనా? హెడ్‌-టు-హెడ్ రికార్డులు ఇవే..

శ‌నివారం జైపూర్‌లోని స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నుంది.

RR vs LSG Match Prediction : ల‌క్నోతో మ్యాచ్ ఓడిపోతే రాజ‌స్థాన్ ఇంటికేనా?  హెడ్‌-టు-హెడ్ రికార్డులు ఇవే..

Rishabh Pant Giants look to improve poor record against out of form Royals

Updated On : April 19, 2025 / 2:46 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ధ‌మైంది. శ‌నివారం జైపూర్‌లోని స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నుంది.

ఈ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్ర‌ద‌ర్శ‌న పేల‌వంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జ‌ట్టు ఏడు మ్యాచ్ మ్యాచ్‌లు ఆడ‌గా రెండు అంటే రెండే మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ -0.714గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతోంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజ‌స్థాన్ త‌ప్ప‌క విజ‌యం సాధించాల్సి ఉంది. ఒక‌వేళ ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ ఓడిపోతే ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం అవుతాయి. దాదాపుగా ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్ర్క‌మించిన‌ట్లే.

RCB vs PBKS : విరాట్ కోహ్లీ 6 ఓవర్ల మ్యాచ్ అని అనుకున్నాడు.. అందుకే అలా.. మ‌హ్మ‌ద్ కైఫ్ కామెంట్స్ వైర‌ల్‌..

మ‌రో వైపు రాజ‌స్థాన్‌తో పోల్చితే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ప‌రిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జ‌ట్టు ఏడు మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. మ‌రో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో ఎనిమిది పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ +0.086గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ల‌క్నో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది. రాజ‌స్థాన్‌పై విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో మ‌రింత ముందుకు వెళ్లాల‌ని ల‌క్నో భావిస్తోంది.

హెడ్‌-టు-హెడ్‌..
ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఐదు సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో రాజ‌స్థాన్ విజ‌యం సాధించింది. ఒక్క మ్యాచ్‌లోనే లక్నో గెలిచింది. ఇక స‌వాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఇరు జ‌ట్లు రెండు మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో చెరో మ్యాచ్‌లో విజ‌యం సాధించాయి.

రాజ‌స్థాన్ హోం గ్రౌండ్ అయిన ఈ స్టేడియంలో ఆర్ఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు 63 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 42 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా 21 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ల్లో సంజూ శాంస‌న్ అత్య‌ధిక ప‌రుగులు సాధించాడు. 5 మ్యాచ్‌ల్లో 200 ప‌రుగులు చేశాడు. ట్రెంట్ బౌల్డ్ 8 వికెట్లు తీసి అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా నిలిచాడు. ప్ర‌స్తుతం బౌల్ట్ ముంబై త‌రుపున ఆడుతున్నాడు.

తుది జ‌ట్ల అంచ‌నా :

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌..
సంజు శాంసన్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, శుభమ్ దూబే, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే/ ఆకాష్ మధ్వల్
ఇంపాక్ట్ ప్లేయ‌ర్.. సందీప్ శర్మ

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌..
మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్/ ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠి,
ఇంపాక్ట్ ప్లేయ‌ర్.. రవి బిష్ణోయ్