Rishabh Pant : వచ్చాడోయ్ పంత్.. కరోనాను జయించి టీమిండియా క్యాంపులోకి రీఎంట్రీ!

భారత యువ వికెట్ కీపర్, పవర్ హిట్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ వచ్చేశాడు.. డెల్టా కరోనాను జయించిన పంత్.. టీమిండియా క్యాంపులోకి రీఎంట్రీ ఇచ్చాడు. పూర్తిగా కోలుకున్న పంత్.. డర్హామ్ లోని టీమిండియా క్యాంపులో చేరాడు.

Rishabh Pant joins Team India camp : భారత యువ వికెట్ కీపర్, పవర్ హిట్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ వచ్చేశాడు.. డెల్టా కరోనాను జయించిన పంత్.. టీమిండియా క్యాంపులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న అనంతరం పంత్.. డర్హామ్ లోని టీమిండియా క్యాంపులో చేరాడు. జూలై 8న పంత్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జూన్ 18 నుంచి 23 వరకూ భారత్, న్యూజిలాండ్ మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ World Test Championship (WTC) ఫైనల్ మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టుకు మూడు వారాల పాటు బ్రేక్ ఇచ్చారు. ఈ విరామ సమయంలో యూరోకప్ మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియంకి వెళ్లిన రిషబ్ పంత్ కరోనా బారిన పడ్డాడు. మాస్క్ ధరించలేదు.. సామాజిక దూరం కూడా పాటించకుండా అభిమానులతో ఫొటోలకు ఫోజిచ్చాడు. ఫలితంగా పంత్ కరోనా బారినపడ్డాడు. ఐసోలేషన్ లోకి వెళ్లిపోయాడు. ఇప్పుడు కరోనా నెగటివ్ వచ్చింది.

డెల్టా కొవిడ్ నుంచి కోలుకున్న అనంతరం రిషబ్ పంత్.. డర్హామ్ లోని టీమిండియా క్యాంపులో చేరాడు. భారత క్రికెట్ బోర్డు (BCCI) పంత్ ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఆ ఫొటోలో పంత్ స్పోర్టింగ్ మాస్క్ తో పాటు ఆరెంజ్ ఫుల్ షర్ట్ ధరించి ఉన్నాడు. బీసీసీఐ తన ట్విట్ లో Hello @RishabhPant17, #TeamIndia అంటూ క్యాప్షన్ ఇచ్చింది.


ప్రస్తుతం భారత జట్టు కౌంటీ ఎలెవన్‌తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ (3-day practice Test match) ఆడుతోంది. ఈ మ్యాచ్ కు పంత్ దూరమయ్యాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇందులో ఫస్ట్ టెస్టు మ్యాచ్‌లో వికెట్ కీపర్ పంత్ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. 2018లోనూ గత టీమిండియా టెస్టు జట్టులో రిషబ్ పంత్ ఆడాడు. ఆ టెస్టు సిరీస్ లో 1-4తో భారత్ ఓటమిపాలైంది.

ట్రెండింగ్ వార్తలు