Rishabh Pant: భారత క్రికెటర్ రిషభ్ పంత్‌ అరుదైన ఘనత.. సచిన్ తర్వాత ఇతడే..

ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత జట్టుతో కలిసి దుబాయ్‌లో ఉన్నాడు.

Rishabh Pant: భారత క్రికెటర్ రిషభ్ పంత్‌ అరుదైన ఘనత.. సచిన్ తర్వాత ఇతడే..

Rishabh Pant

Updated On : March 3, 2025 / 7:12 PM IST

భారత క్రికెటర్ రిషభ్ పంత్‌.. లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డ్స్‌-2025 కమ్‌ బ్యాక్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఇంతకు ముందు భారత్‌ నుంచి సచిన్ టెండూల్కర్ మాత్రమే నామినేట్ అయ్యారు.

ఇప్పుడు ఆ ఘనతను రిషభ్ పంత్‌ కూడా సొంతం చేసుకున్నాడు. వచ్చే నెల 21న స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్‌లో ఈ పురస్కారాలను ఇస్తారు. రిషభ్ పంత్‌కి దాదాపు రెండున్నరేళ్ల క్రితం కారు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

అప్పట్లో రిషభ్ పంత్ ఆపరేషన్ చేయించుకుని, చాలా కాలం పాటు విశ్రాంతి తీసుకున్నాడు. మొత్తం 14 నెలల పాటు అతడు రెస్ట్ తీసుకున్నాక కోలుకున్నాడు. గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో మళ్లీ ఆడాడు.

Also Read: ఇటువంటి ఇబ్బందులు అన్నీ ఎదుర్కొన్నా: శ్రేయాస్‌ అయ్యర్ కామెంట్స్‌

ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత జట్టుతో కలిసి దుబాయ్‌లో ఉన్నాడు. టీమిండియా మంగళవారం ఆసీస్‌తో సెమీఫైనల్‌ ఆడనుంది. ఇందులో గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది.

ఈ ట్రోఫీలో రిషభ్‌ పంత్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే ఛాన్స్‌ రాలేదు. ఐపీఎల్‌లో రిషభ్ పంత్‌ లక్నో టీమ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. రిషభ్ పంత్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు.

దూకుడైన బ్యాటింగ్ స్టైల్, ఒత్తిడిలోనూ ఆడే సామర్థ్యం అతడికి ఉంది. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పటికీ, తిరిగి కోలుకుని, మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టి తనేంటో నిరూపించుకున్నాడు.