Rohit Sharma : భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, టెస్టులకు వైస్ కెప్టెన్.. సౌతాఫ్రికా వెళ్లే భారత జట్టు ఇదే..
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‌గా నియామకం అయ్యాడు. టీమిండియా వన్డే కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ శర్మకు అప్పగించాలని భారత సీనియర్ క్రికెట్ సెలెక్షన్ కమిటీ..

Rohit Sharma
Rohit Sharma : హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‌గా నియామకం అయ్యాడు. టీమిండియా వన్డే కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ శర్మకు అప్పగించాలని భారత సీనియర్ క్రికెట్ సెలెక్షన్ కమిటీ నిర్ణయించిందని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం టీ20లకు మాత్రమే సారధిగా ఉన్న రోహిత్.. ఇక నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్ మొత్తానికి టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
ప్రస్తుతం వన్డే, టెస్ట్ కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి కేవలం టెస్ట్ సారధ్య బాధ్యతలకు మాత్రమే పరిమితం కానున్నాడు. టీ20 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగాలని కోహ్లి నిర్ణయించుకోవడంతో రోహిత్‌ని పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా నియమించారు. ఇప్పుడు వన్డేలకూ కెప్టెన్ ని చేశారు. ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ కూడా రోహిత్ శర్మను వన్డే జట్టుకు కెప్టెన్‌గా నియమించాలని నిర్ణయించిందని బీసీసీఐ ట్వీట్ లో తెలిపింది.
Bipin Rawat : బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కూలడానికి కారణాలు ఇవేనా..!
భారత క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ శకం మొదలైందని చెప్పుకోవచ్చు. తొలుత టీ20లకు కెప్టెన్ అయిన రోహిత్ ఇప్పుడు వన్డేలకూ సారథిగా ఎంపికయ్యాడు. టెస్టులకు వైస్ కెప్టెన్ గానూ నియమించబడ్డాడు. ఇప్పటికే రోహిత్ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్ లను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు దక్షిణాఫ్రికాలో డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే 3 టెస్టుల సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. రోహిత్ శర్మను టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
Army Chopper Crash : భారత తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి..20ఏళ్లకే ఆర్మీలో చేరి..
సౌతాఫ్రికాకు వెళ్లే భారత టెస్ట్ జట్టు..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మాయంక్ అగర్వాల్, పుజారా, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, హనుమ విహరి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), అశ్విన్, జయంత్ యాదవ్, ఇశాంత్ శర్మ, షమీ, ఉమేష్ యాదవ్, బుమ్రా, శార్దూల్ ఠాగుర్, సిరాజ్.
స్టాండ్ బై ప్లేయర్లు.. నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అజ్రన్ నగ్వాస్వాల్లా
The All-India Senior Selection Committee also decided to name Mr Rohit Sharma as the Captain of the ODI & T20I teams going forward.#TeamIndia | @ImRo45 pic.twitter.com/hcg92sPtCa
— BCCI (@BCCI) December 8, 2021