Rohit Sharma : రోహిత్ శర్మ అరుదైన ఘనత..

భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో పది వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ 2023లో సూపర్ 4 దశలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు.

Rohit Sharma : రోహిత్ శర్మ అరుదైన ఘనత..

Rohit Sharma

Rohit Sharma record : భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో పది వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ 2023లో సూపర్ 4 దశలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. సిక్స్ తో రోహిత్ ఈ ఘనతను అందుకోవడం విశేషం. 241 ఇన్నింగ్స్ ల్లో రోహిత్ ఈ మైలు రాయిని చేరుకున్నాడు. అత్యధిక వేగంగా 10 వేల క్లబ్ లో అడుగుపెట్టిన రెండవ బ్యాటర్ గా హిట్ మ్యాన్ నిలిచాడు.

Virat Kohli : పాకిస్తాన్ పై రికార్డు బ్రేక్ ఇన్నింగ్స్.. విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ వైరల్..!

వన్డేల్లో అత్యధిక వేగంగా 10 వేల పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ 205 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. వీరిద్దరి తరువాత సచిన్ టెండూల్కర్ (259), సౌరవ్ గంగూలీ (263), రికీ పాంటింగ్ (266) లు ఉన్నారు.

వన్డేల్లో అత్యంత వేగంగా 10 వేల పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..

  • విరాట్ కోహ్లీ – 205
  • రోహిత్ శర్మ 241
  • సచిన్ టెండూల్కర్ – 259
  • సౌరవ్ గంగూలీ – 263
  • రికీ పాంటింగ్ – 266