Rohit Sharma: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు
రోహిత్ శర్మ ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు వచ్చి పడింది.

Rohit sharma Most ducks in IPL history
Rohit Sharma: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మైదానంలోకి అడుగుపెట్టాడంటే చాలు ఎలాంటి బౌలింగ్‌ను అయినా చాలా అలవోకగా ఆడేస్తాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ ఎందరో బౌలర్లకు నిద్రలేని రాత్రుళ్లు మిగిల్చాడు. ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ ఐదు సార్లు ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ లీగ్‌లో అత్యధిక సార్లు(19) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లు గెలుచుకున్న భారత ఆటగాడిగా ఉన్నాడు.
అయితే.. తాజాగా రోహిత్ శర్మ ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు వచ్చి పడింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఇన్నింగ్స్ మూడో బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 15 సార్లు డకౌట్ అయ్యాడు. దినేశ్ కార్తిక్(15), సునీల్ నరైన్(15), మణిదీప్ సింగ్ (15) లు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
??? ???? & ??? ???, Hitman Rohit Sharma’s story so far in IPL.
?: IPL/BCCI pic.twitter.com/RrGE612eIn
— CricTracker (@Cricketracker) May 3, 2023
అంతేకాదండోయ్.. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కూడా ఎక్కువగా డకౌట్ అయిన జాబితాలోనూ హిట్‌మ్యాన్ చేరిపోయాడు. రోహిత్ శర్మ(10), గౌతమ్ గంభీర్(10), ఆడమ్ గిల్‌క్రిస్ట్(7), షేన్ వార్న్(7), విరాట్ కోహ్లి(6)ఈ జాబితాలో ఉన్నారు.
Most ducks as captain in IPL:
10 – Gautam Gambhir
10 – Rohit Sharma
7 – Adam Gilchrist
7 – Shane Warne
6 – Virat Kohli#IPL2023— CricTracker (@Cricketracker) May 3, 2023
ఇక ఈ సీజన్‌లో రోహిత్ శర్మ కేవలం ఒకే ఒక అర్ధశతకం బాదాడు. 1, 21, 65, 20, 28, 44, 2, 3,0 తో విఫలం అవుతున్నాడు.