రస్సెల్ మనిషేనా: ఆర్సీబీపై అంత పంతమా

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుని రెచ్చిపోయింది కోల్ కతా నైట్ రైడర్స్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మరోసారి బెంగళూరుకు ఐపీఎల్ పరాజయం ఎదురైంది. విజయ కాంక్షతో రగిలిపోతున్న బెంగళూరు పట్టుదలతో 205 పరుగుల టార్గెట్ ను కోల్ కతా ముందుంచింది. లక్ష్య చేధనకు బరిలోకి దిగి ఆరంభం నుంచి దూకుడైన ఇన్నింగ్స్ కొనసాగించింది.
ఈ క్రమంలో ఒకానొక దశలో ఆర్బీబీ విజయం ఖాయమనిపించింది. ఆ తరుణంలో రస్సెల్ విజృంభణ బెంగళూరు పతనాన్ని శాసించింది. 13 బంతుల్లో 48 పరుగులు(1 ఫోర్, 7 సిక్సులు) బాది చక్కటి ముగింపునిచ్చాడు. ఫలితంగా బెంగళూరుపై కోల్ కతా 5వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఆండ్రీ రస్సెల్ నే వరించింది.
కోల్ కతా నైట్ రైడర్స్.. తర్వాతి మ్యాచ్ ను రాజస్థాన్ రాయల్స్ తో రాజస్థాన్ వేదికగా ఏప్రిల్ 7న జరగనుంది. అయితే మరోసారి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది.