Rickelton : వామ్మో.. బాదుడే బాదుడు.. ర్యాన్‌ రికెల్టన్‌ సరికొత్త చరిత్ర..

Rickelton : సౌతాఫ్రికా టీ20లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ ప్లేయర్ ర్యాన్ రికెల్టన్ బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Rickelton : వామ్మో.. బాదుడే బాదుడు.. ర్యాన్‌ రికెల్టన్‌ సరికొత్త చరిత్ర..

Ryan Rickelton

Updated On : January 11, 2026 / 3:12 PM IST

Rickelton : సౌతాఫ్రికా టీ20లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ ప్లేయర్ ర్యాన్ రికెల్టన్ బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు. లీగ్ చరిత్రలో రెండు వ్యక్తిగత సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రికెల్టన్‌ కాకుండా సౌతాఫ్రికా 20 లీగ్‌లో మరో ఎనిమిది మంది (డుప్లెసిస్‌, క్లాసెన్‌, మార్క్రమ్‌, డస్సెన్‌, హెర్మన్‌, విల్‌ జాక్స్‌, వెర్రిన్‌, హోప్‌) మాత్రమే తలో సెంచరీ చేశారు.

Also Read : IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే.. బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టులో చోటు వీరికే..

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ఎంఐ కేప్‌టౌన్, జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 234 పరుగులు చేసింది. ఎంఐ కేప్‌టౌన్ బ్యాటర్ రికెల్టన్ బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. కేవలం 60 బంతుల్లోనే 113 (నాటౌట్) పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. రికెల్టన్ తో పాటు మరో ఓపెనర్ డస్సెన్ (65) కూడా రాణించాడు. మిగిలిన బ్యాటర్లు పూరన్ 14, జేసన్ స్మిత్ 2, కరీం జనత్ 20(నాటౌట్) పరుగులు చేశారు.


భారీ లక్ష్య చేధనకోసం బరిలోకిదిగిన జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు బ్యాటర్లు ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. కానీ, నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు ఐదు వికెట్లు నష్టపోయి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఛేదనలో పోరాడిన సూపర్‌ కింగ్స్‌ లక్ష్యానికి 37 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సూపర్ కింగ్స్ తరపున డియాన్ ఫెరియోరా (80 నాటౌట్) చివరి వరకు పోరాటం చేశాడు. కానీ, జట్టును విజయతీరాలకు చేర్చలేక పోయాడు. అంతకుముందు సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ జేమ్స్ విన్స్ (77) అర్ధ సెంచరీతో రాణించాడు.