IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే.. బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టులో చోటు వీరికే..

IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య స్వదేశంలో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచి టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే.. బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టులో చోటు వీరికే..

IND vs NZ 1st ODI

Updated On : January 11, 2026 / 1:22 PM IST

IND vs NZ 1st ODI : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య స్వదేశంలో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. వడోదరలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు.

చాలా రోజులుగా ఆటకు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఈ వన్డేతో పునరాగమనం చేస్తున్నాడు. మరోవైపు గాయం కారణంగా రిషబ్ పంత్ వన్డే సిరీస్ కు దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో ఎంపికైన ద్రువ్ జురెల్ కు తొలివన్డే తుది జట్టులో చోటు దక్కలేదు.

భారత జట్టు: శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, హర్షిత్‌ రాణా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ