One World One Family Cup : అన్నా న‌న్ను క్ష‌మించు.. నీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టాను..

వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ క‌ప్‌లో భాగంగా జ‌రిగిన ఫ్రెండ్లీ మ్యాచులో ఓ అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది.

One World One Family Cup : అన్నా న‌న్ను క్ష‌మించు.. నీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టాను..

Yusuf Pathan-Irfan Pathan

Updated On : January 18, 2024 / 7:26 PM IST

One World One Family Cup : వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ క‌ప్‌లో భాగంగా జ‌రిగిన ఫ్రెండ్లీ మ్యాచులో ఓ అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. అన్న బౌలింగ్‌లో త‌మ్ముడు సిక్స్ కొట్టి త‌న జ‌ట్టును గెలిపించాడు. అనంత‌రం త‌న అన్న‌ను కౌగించుకుని త‌న‌ను క్ష‌మించాల‌ని వేడుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇంత‌కూ అన్నద‌మ్ములు మ‌రెవ‌రో కాదు టీమ్ ఇండియా మాజీ ఆట‌గాళ్లు యూస‌ఫ్ ప‌ఠాన్‌, ఇర్ఫాన్ ప‌ఠాన్‌లు.

క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్‌తో పాటు వివిధ దేశాల‌కు చెందిన క్రికెట్ దిగ్గ‌జాలు అంతా క‌లిసి రెండు జ‌ట్లుగా విడిపోయివన్‌ వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ పేరిట రెండు జ‌ట్లుగా విడిపోయి ఓ టీ20 మ్యాచ్ ఆడారు. బెంగ‌ళూరులోని సాయి క్రిష్ణ‌న్ క్రికెట్ అకాడ‌మీ ఈ మ్యాచ్‌కు వేదికైంది. వ‌న్ వ‌ర‌ల్డ్ జ‌ట్టుకు స‌చిన్ నాయ‌కత్వం వ‌హించ‌గా, వ‌న్ ఫ్యామిలీ జ‌ట్టుకు యువ‌రాజ్ సింగ్ సార‌థ్యం వ‌హించాడు. ఇక అన్న‌ద‌మ్ములైన ఇర్ఫాన్, యూస‌ప్‌లు చెరో టీమ్‌లో ఆడారు. యూస‌ఫ్ యువీ టీమ్‌లో ఆడ‌గా ఇర్ఫాన్ స‌చిన్ టీమ్‌లో ఆడాడు.

Virat Kohli : విరాట్ కోహ్లీ అద్భుత బౌండరీ సేవ్‌పై ఆనంద్ మహీంద్రా.. ‘హలో, ఐజాక్ న్యూటన్?’

ఈ మ్యాచ్‌లో యువీ టీమ్ అయిన వ‌న్ ఫ్యామిలీ నిర్ణీత 20 ఓవర్లలో 6 కోల్పోయి 180 పరుగులు చేసింది. డారెన్‌ మ్యాడీ (51) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా కలువితరణ 22, యూసఫ్‌ పఠాన్‌ 38, యువరాజ్‌ సింగ్‌ 23 పరుగులు చేశారు. వన్‌ వరల్డ్‌ బౌలర్లలో హర్భజన్‌ సింగ్‌ 2 వికెట్లు తీశాడు. సచిన్‌, ఆర్పీ సింగ్‌, అశోక్‌ దిండా, మాంటీ పనేసర్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం అల్విరో పీట‌ర్స‌న్ (74) రాణించ‌డంతో ల‌క్ష్యాన్ని వ‌న్ వ‌ర‌ల్డ్ 19.5 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సచిన్‌ టెండూల్కర్‌ (27), నమన్‌ ఓఝా (25), ఉపుల్‌ తరంగ (29) రాణించారు. వ‌న్ ఫ్యామిలీ బౌల‌ర్ల‌లో చ‌మింద వాస్ మూడు వికెట్లు తీశాడు. ముత్తయ్య మురళీథరన్‌, యువరాజ్‌ సింగ్‌, జేసన్‌ క్రేజా త‌లా ఓ వికెట్ సాధించారు.

ఆఖ‌రి ఓవ‌ర్‌లో విజ‌యానికి ఏడు ప‌రుగులు..

ఆఖ‌రి ఓవ‌ర్‌లో స‌చిన్ టీమ్ గెల‌వాలంటే ఏడు ప‌రుగులు కావాలి. చివ‌రి ఓవ‌ర్ యూస‌ప్ ప‌ఠాన్ వేశాడు. మొద‌టి నాలుగు బంతుల‌ను క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో కేవ‌లం నాలుగు ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. దీంతో విజ‌య స‌మీక‌ర‌ణం రెండు బంతుల్లో మూడు ప‌రుగులుగా మారింది. అయితే.. ఐదో బంతికి ఇర్ఫాన్ సిక్స్ బాది జ‌ట్టును గెలిపించాడు. సిక్స్ బాదిన వెంట‌నే అన్న యూస‌ఫ్ ను ఇర్ఫాన్ వ‌చ్చి గ‌ట్టిగా హ‌త్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్‌గా మారగా.. నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

సూప‌ర్ ఓవ‌ర్‌లో రోహిత్ శ‌ర్మ తొండాట‌..! ఆకాశ్ చోప్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

;