ఆచ్రేకర్ ఇక లేరు : క్రికెట్ లోకం ఘన నివాళి

  • Published By: madhu ,Published On : January 3, 2019 / 01:57 AM IST
ఆచ్రేకర్ ఇక లేరు : క్రికెట్ లోకం ఘన నివాళి

ఢిల్లీ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోచ్, గురువు రమాకాంత్ ఆచ్రేకర్ (87) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన 2019, జనవరి 2వ తేదీ సాయంత్రం తన నివాసంలో కన్నుమూశారు. సరిగ్గా తన పుట్టిన రోజు నాడే ఆయన మరణించడం పలువురిని బాధించింది. సచిన్ కోచ్‌గా ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. 

1932, జనవరి 2న జననం…
1932 జనవరి 2వ తేదీన మహారాష్ట్రంలో జన్మించిన ఆచ్రేకర్ 1943లో క్రికెట్ ఆడడం ప్రారంభించారు. 1945లో న్యూ హింద్ స్పోర్ట్స్ క్లబ్ తరపున ఆడారు. 1963లో హైదరాబాద్‌తో జరిగిన మొయినుద్దౌలా గోల్డ్ కప్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఎస్‌బీఐ తరపున ఆచ్రేకర్ బరిలోకి దిగారు. ముంబై సెలెక్టర్‌గా పనిచేసిన ఈయన…శిక్షకుడిగా అవతారం ఎత్తారు. వర్ధమాన ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చారు. సచిన్, వినోద్ కాంబ్లీ, రమేశ్ పోవార్, ప్రవీణ్ ఆమ్రే, చంద్రకాంత్ పండిట్, అజిత్ అగార్కర్, బల్వీందర్ సింగ్, సమీర్ దిఘే వంటి ఎంతో మంది క్రికెటర్లను తీర్చిదిద్దారు. 
సచిన్‌ గురువు…
ఇందులో ప్రధానంగా సచిన్ టెండూల్కర్ గురించి చెప్పాలి. 11 ఏళ్ల వయస్సులో సచిన్ క్రికెట్ ఓనమాలు దిద్దాడు. టీమిండియాలో సచిన్ రావడంతో భారత క్రికెట్‌ ఘనకీర్తిని సంపాదించుకుంది. ప్రపంచంలోనే మేటీ క్రికేటర్‌గా మార్చిన ఘనత ఆచ్రేకర్‌కి దక్కుతుంది. ఇక 1990లో ద్రోణాచార్య అవార్డు, 2010లో పద్మశ్రీ అవార్డు లభించాయి. 
ఆయన మ‌ృతిపై సచిన్ టెండూల్కర్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. చాలా మంది శిష్యులలాగానే ఆయన దగ్గర ఓనమాలు నేర్చుకున్నానని..ఆయన వేసిన పునాదిపై నిలబడినట్లు సచిన్ తెలిపారు. జీవితంలో నిజాయితీగా ఉండడం నేర్పించారని వెల్లడించిన సచిన్…తన జీవితంలో ఆయన పాత్ర గురించి మాటల్లో చెప్పలేనని తెలిపారు.