నన్ను నేను చూసుకున్నా : సచిన్ మనసు దోచుకున్న ఆసీస్ క్రికెటర్
ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మార్నస్ లబుషేన్ పై టీమిండియా లెజెండ్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. లబుషేన్ ప్రతిభను సచిన్ కొనియాడాడు. అతడి

ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మార్నస్ లబుషేన్ పై టీమిండియా లెజెండ్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. లబుషేన్ ప్రతిభను సచిన్ కొనియాడాడు. అతడి
ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మార్నస్ లబుషేన్ పై టీమిండియా లెజెండ్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. లబుషేన్ ప్రతిభను సచిన్ కొనియాడాడు. అతడి ఆటతీరు అచ్చం తనలానే ఉందని కితాబిచ్చాడు. ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన చారిటీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సచిన్ మాట్లాడాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో ఎవరైనా మిమ్మల్ని మీకు గుర్తు చేశారా? అని సచిన్ ను ప్రశ్నించగా.. మార్నస్ లుబుషేన్ పేరుని సచిన్ ప్రస్తావించాడు. లబుషేన్ ని చూస్తే.. ఒకప్పటి తనను చూసుకున్నట్టు ఉందని తెలిపాడు. లబుషేన్ ఫుట్ వర్క్ అద్బుతంగా ఉంటుందని, అచ్చం తనలానే ఉందని కితాబిచ్చాడు. అందుకే లబుషేన్ తనని గుర్తు చేశాడని చెప్పాడు.
లబు షేన్ టెక్నిక్ చూస్తుంటే అచ్చం తనలా ఉందని సచిన్ చెప్పాడు. అతడిలో అపార నైపుణ్యం ఉందన్నాడు. అతడి ఫుట్ వర్క్ అమోఘం అని కొనియాడాడు. అచ్చం తనలానే ఆడుతున్నాడని కితాబిచ్చాడు. 2019 ఆగస్టులో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా స్మిత్ గాయపడడంతో అతడి స్థానంలో కాంకషన్ సబ్ స్టిట్యూట్‌గా బ్యాటింగ్‌కు దిగిన మార్కస్ లబుషేన్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ ఆసీస్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2019 ఆగస్టు 14 నుంచి అతడి టెస్టు కెరీర్ చూస్తే… 59, 74, 80, 67, 11, 48, 14, 185, 162, 143, 50, 63, 19, 215, 59తో టెస్టుల్లో అతని సగటు 63గా ఉంది.
”లార్డ్స్ లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ చూశా. రెండో ఇన్నింగ్స్ లో లబుషేన్ ఆట అద్భుతం. జోఫ్రా ఆర్చర్ రెండో బంతి లబుషేన్ కు తగిలింది. ఆ తర్వాత 15 నిమిషాలు అతడి ఆట చూశాక ఈ ఆటగాడు ప్రత్యేకంగా కనిపించాడు. ఫుట్ వర్క్ భౌతికమైంది కాదు. మానసికమైంది. మనసులో సానుకూలంగా ఆలోచించకపోతే పాదాలు కదలవు. లబుషేన్ ఫుట్ వర్క్ అద్భుతం” అని సచిన్ అన్నాడు. కాగా, విరాట్ కోహ్లి, స్మిత్ లలో ఎవరు బెస్ట్ బ్యాట్స్ మన్ అన్న ప్రశ్నకు స్పందించడానికి సచిన్ నిరాకరించాడు.