Road Safety World Final: సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో టోర్నీ గెలిచిన లెజెండ్స్
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 క్రికెట్ టోర్నీ కప్‌లో భాగంగా రిటైర్డ్ క్రికెటర్లతో టోర్నీ నిర్వహించారు. ఇందులో ఛాంపియన్‍గా భారత్ కు చెందిన లెజెండ్స్ జట్టు గెలిచింది. టీమిండియా మాజీ ప్లేయర్ టెండూల్కర్ కెప్టెన్సీలోని..

Sachin Tendulkar
Road Safety World Final: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 క్రికెట్ టోర్నీ కప్‌లో భాగంగా రిటైర్డ్ క్రికెటర్లతో టోర్నీ నిర్వహించారు. ఇందులో ఛాంపియన్‍గా భారత్ కు చెందిన లెజెండ్స్ జట్టు గెలిచింది. టీమిండియా మాజీ ప్లేయర్ టెండూల్కర్ కెప్టెన్సీలోని భారత జట్టు 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్ జట్టును ఓడించింది. యూసఫ్ పఠాన్ (36 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), యువరాజ్ సింగ్ (41 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగుల భారీ స్కోరు చేసింది. సెహ్వాగ్ (12 బంతుల్లో 10; 1 సిక్స్) విఫలంకాగా… సచిన్ టెండూల్కర్ (23 బంతుల్లో 30; 5 ఫోర్లు) రాణించాడు. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. దిల్షాన్ (18 బంతుల్లో 21; 3 ఫోర్లు), జయసూర్య (43; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించి శుభారంభం అందించారు.
వీరిద్దరూ అవుట్ అయ్యాక లంక జోరు తగ్గింది. చివర్లో జయసింఘా (30 బంతుల్లో 40; ఫోర్, 2 సిక్స్‌లు), వీర రత్నే(15 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. భారత స్పిన్నర్ యూసఫ్ పఠాన్ రెండు వికెట్లు తీశాడు. చత్తీస్‌ఘఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ చేతుల మీదుగా సచిన్ లెజెండ్స్ కప్‌ను అందుకున్నాడు.
ఈ మేరకు టోర్నీ గెలిచిన సందర్భంగా ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు. యూసఫ్ పఠాన్, మొహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ లు ఫొటోలు షేర్ చేసుకుని అందరితో పంచుకున్నారు.
Well done youngsters !!! ??? congratulations #indian legends @sachin_rt @virendersehwag @MohammadKaif @munafpa99881129 @imMsgony @IrfanPathan @iamyusufpathan ????? pic.twitter.com/ZTFX8MlfMh
— Yuvraj Singh (@YUVSTRONG12) March 21, 2021
Was fun to play the #RoadSafetyWorldSeries2021 and to spend time in the park with friends and winning the tournament was an icing on the cake. Memorable few weeks. #INDLvSLL pic.twitter.com/d4C72QBw0J
— Virender Sehwag (@virendersehwag) March 21, 2021
Even after so many years, nothing compares to that winning feeling! #champions #teamwork #roadsafetyworldseries pic.twitter.com/PTXCpLMpDC
— Mohammad Kaif (@MohammadKaif) March 21, 2021
Even after so many years, nothing compares to that winning feeling! #champions #teamwork #roadsafetyworldseries pic.twitter.com/PTXCpLMpDC
— Mohammad Kaif (@MohammadKaif) March 21, 2021
What a game of cricket! Thrilled to be a part of the champion team. This victory will be remembered for a long time. A great effort from each and every teammate. Thank you for your wishes throughout the game. #RoadSafetyWorldSeries pic.twitter.com/46K4ksiCN3
— Yusuf Pathan (@iamyusufpathan) March 21, 2021
WOW ? …. ECSTATIC… Over the Moon!
Well played #TeamIndia! ??#RoadSafetyWorldSeries pic.twitter.com/PIWF2ONQv0
— Sachin Tendulkar (@sachin_rt) March 21, 2021